Breaking News

ఊరు మెచ్చిన దీదీ

Published on Tue, 04/28/2026 - 00:42

పెద్ద చదువు చదువుకోలేకపోయినా, ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. ఇల్లు దాటి బయటికి వస్తే సమాజం అనే విశ్వ విద్యాలయంలో ఎన్నో చదువుకోవచ్చు...ఈ ఎరుకతో ఇల్లు దాటి బయటికి వచ్చిన సామాన్య గృహిణి, పెద్దగా చదువుకోని చందా బాబర్‌(మధ్యప్రదేశ్‌) ఇప్పుడు ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. 

మధ్యప్రదేశ్‌  ఝుబువా జిల్లాలోని గుణవాడ్‌ గ్రామంలో మధ్యాహ్నం వేళ కొద్దిమంది మహిళలు వేపచెట్టు కింద కూర్చొని తమ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చల్లో కీలక మహిళ... చందా బాబర్‌. తమకు ఏ సమస్యలు వచ్చినా గ్రామస్థులు మొదట చెప్పుకునేది ఆమెకే. ‘ప్రజలు ఎలాంటి సమస్యలతో వచ్చినా నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది చందా. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన చందాకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. చాలా సంవత్సరాలు ఇల్లే ప్రపంచంగా మారింది. ఇల్లు దాటి ఏదైనా చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది.

ఆ ప్రశ్నతో తొలి అడుగు
ఇప్పుడు చందా బాబర్‌ ట్రాన్స్‌ఫామ్‌ రూరల్‌ ఇండియా (టీఆర్‌ఐ) ద్వారా శిక్షణ పొందిన ‘పంచాయత్‌ బద్లాన్‌ దీదీ’గా పిలిచే క్షేత్రస్థాయి గ్రామీణ కార్యకర్త. గ్రామీణ మహిళలు స్థానిక పరిపాలన వ్యవస్థలతో మమేకమవడానికి, వారిలో తగిన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడే టీఆర్‌ఐ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చందా... ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు చేరడం లేదు?’ అని ప్రశ్నించింది. ఆమెకు ఏ సమాధానం అందిందో తెలియదుగానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే  సంకల్పంతో ఆనాటి నుంచి ఎన్నో వర్క్‌షాపులకు హాజరైంది. ఎన్నో విషయాలపై ఎంతో అవగాహన పెంచుకుంది. ‘పంచాయత్‌ బద్లావ్‌ దీదీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. 

‘పంచాయత్‌ బద్లావ్‌  దీదీ’ హోదాలో ఎవరికైనా  వైద్య అవసరాలు ఉంటే వారికి అన్ని రకాలుగా సహాయంగా నిలుస్తోంది. ‘ఈ ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి’ అని ప్రచారం చేస్తోంది.
‘మా గ్రామంలో చందా మార్పు తీసుకురావాలనుకుంటోంది. మా దగ్గర గతంలో లేనిది మాకు ఇచ్చింది.. అది ప్రశ్నలు అడిగే ధైర్యం’ అని చందాను ప్రశంసిస్తున్నారు గ్రామస్థులు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు... ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడం నుంచి ప్రజాచైతన్యం వరకు ‘పంచాయత్‌ బద్లావ్‌ దీదీ’ హోదాలో ఎన్నో మంచి పనులు చేస్తోంది.

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)