Breaking News

ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్‌ వ్లాగర్ ఎమోషనల్‌ వీడియో వైరల్‌

Published on Fri, 05/17/2024 - 19:30

పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్‌ అయిన మహమ్మద్ షిరాజ్  తన ఫ్యాన్స్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా  ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్‌ ఇదే నా చివరి వ్లాగ్‌ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.

మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్‌ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)"   అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.  "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.

అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు.  ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్‌ సాధించింది.

కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం  నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు  కూడా చేయి మొరకరు కమెంట్‌ చేశారు.  చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని  కమెంట్‌ చేశారు.

కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్‌ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ బాగా పేరు సంపాదించాడు.  
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)