Breaking News

పెయిన్‌కిల్లర్స్‌ అబ్యూజ్‌..! పెయిన్‌ తగ్గించడమా? ప్రాణసంకటమా?

Published on Sun, 06/23/2024 - 06:15

మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్‌ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్‌ కిల్లర్స్‌ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్‌ కిల్లర్స్‌ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.

భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్‌ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని   పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... 
పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్‌ అప్‌సెట్‌), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్‌ అల్సర్స్‌) రావచ్చు.

అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్‌ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.

హైపర్‌టెన్షన్‌ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల  రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.

కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్‌ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్‌ కిల్లర్స్‌ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.

కిడ్నీలపైన: 
కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్‌కిల్లర్‌ టాబ్లెట్స్‌లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్‌కిల్లర్స్‌ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్‌ కిల్లర్స్‌ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.

నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.

నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్‌ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు  మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.

రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.

చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్‌ వంటì  వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.

వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.

దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...
– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం 
– చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్‌కు తెలపాలి.

దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...
నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... 
– పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. 
– అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. 
– కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్‌ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి.  
– పెయిన్‌ కిల్లర్స్‌ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ  పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.

ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు