Breaking News

సహజ సౌందర్యానికి కేరాఫ్‌​ ఈ నటి..! రియల్‌ బ్యూటీ అంటే..

Published on Tue, 03/10/2026 - 14:35

బాలీవుడ్‌ నటి కొల్హాపురే ఒకప్పుడు అత్యంత బిజీగా ఉండే హీరోయిన్‌లలో ఆమె ఒకరు. 'ప్యార్‌ ఝక్తా నహీ' వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఉర్దూ నాటకాల్లో నటిస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్నారామె. ఆరు పదుల వయసులోనూ..నటి పద్మిని ఎవర్‌గ్రీన్‌ అందంతో గ్లామర్‌గా ఉంటారామె. అంతలా నవయవ్వనంగా ఉండటానికి గల కారణాలను వెల్లడిస్తూ..అందంపై తన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించారామె.

ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే తన సహజ సౌందర్యం, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ పరంగా అందరికీ ఆరాధ్య దేవత ఆమె.  ఇటీవల ఒక ఇంటర్యూలో తన చర్మ సంరక్షణ, మేకప్‌ అలవాట్ల గురించి షేర్‌ చేసుకున్నారు. అలాగే నిజమైన అందం సౌందర్య సాధనాలకు మించినదని ఎందుకు విశ్వసిస్తుందో కూడా చెప్పారామె. తాను స్వతహాగా కఠినమైన చర్మ సంరక్షణను అనుసరించే వ్యక్తిని కాదని అన్నారామె. తాను రసాయన ఉత్పత్తుల కంటే సహజ సౌందర్య సాధనాలనే ఎంచుకుంటానని అన్నారు. ముఖ్యంగా సహజ సేంద్రీయ ఆయుర్వేద ఉత్పత్తులనే ఉపయోగిస్తానని చెప్పారామె. 

ముఖ్యంగా ఇంట్లోనే లభించే వాటికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంటింట్లో బాగా ఉపయోగించే పసుపుని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసేవాళ్లమని అన్నారు. అలాగే పసుపు, ఉప్పుతో సదా పుక్కిలించేవాళ్లమని, ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడూ..24/7  మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు  కూడా తొలగించుకోలేకపోయే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. 

కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాను చర్మాన్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అస్సలు మేకప్‌ వాడటం లేదని అన్నారు. తన బ్యూటీకిట్‌ మూడింటిని తప్పనిసరిగా వాడతానని అన్నారు. వాసెలిన్‌, మేకప్‌ రిమూవర్‌, సహజ వైప్‌లను ఇష్టపడతానని చెప్పారు. అవన్నీ కూడా సహజసిద్ధమైనవేనని  చెప్పారు. మేకప్‌ పరంగా చాలా తక్కువ ప్రొడక్ట్స్‌, సౌకర్యవంతమైనవే ఉపయోగిస్తానని చెబుతున్నారు.

హెయిర్ కేర్ ఎలాగంటే..
జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నేను సాంప్రదాయ పద్ధతులను ఇష్టపడతానని చెప్పారు. ఆయుర్వేద షాంపూలు, షికాకాయి, భ్రింగ్ రాజ్ వంటివి ఉపయోగిస్తానని చెప్పారు. హెయిర్‌ డ్రైయర్లు, కర్లర్లు వంటివి తక్కువగానే ఉపయోగిస్తానని అన్నారు. తలకు సైతం కెమికల్స్‌ లేనివే ఎంచుకుంటానని అన్నారు. 

చివరగా అందం అనేది బాహ్యంగా కంటే అంతర్గతంగా ప్రతిబింబించేది అని నమ్ముతానన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండి,  నిస్వార్థపరులు అయితే ఆ అందం మీ ముఖంపై తొణికిసలాడుతుంది. మెరిసే చర్మం కోసం ప్రజలు బాగా తినాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని, హైడ్రేటెడ్‌గా ఉండాలని అన్నారు. అలాగే అప్పట్లో తమకు రెండే రెండు మేకప్‌ బ్రాండ్‌లు ఉండేవని, ఇప్పుడు తల నుంచి కాలి వరకు ఇబ్బడిముబ్బడిగా బ్రాండెడ్‌ మేకప్‌ ఉత్పత్తులు ఉన్నాయిని అన్నారు.

(చదవండి: ఇప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్‌ రోగులకు..)

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు