Breaking News

Charlotte Chopin: యోగవికాసానికి పద్మ పురస్కారం!

Published on Thu, 06/27/2024 - 08:26

నూటొక్క వసంతాలను చూసిన చార్లోట్‌ చోపిన్‌ ఈ ఏడాది మే నెలలో మనదేశం అందించే అత్యున్నత పద్మపురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పుట్టి వందేళ్లు దాటింది. నిజమే, 1922, డిసెంబర్‌ 11వ తేదీన ఫ్రాన్స్‌లోని చేర్‌ పట్టణంలో పుట్టారామె. యాభై ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానంగా యోగసాధన ప్రారంభించారు చార్లోట్‌. అప్పటి నుంచి ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.

తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అంతటితో సంతృప్తి చెందలేదామె. యోగసాధన గురించి ప్రపంచానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైన జీవనానికి యోగసాధనను మించినది మరొకటి లేదని వర్క్‌షాప్‌లు పెట్టి అవగాహన కల్పించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకుంటున్న చార్లోట్‌ చోపిన్‌

ఫ్రాన్స్‌లో పరిమళించిన మనప్రాచీన విద్య..
చార్లోట్‌ 1982 లో చేర్‌ పట్టణం నుంచి యోగసాధన పట్ల అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యోగసాధన వల్ల లభించే ప్రయోజనాలను వివరిస్తూ, యోగసాధన నేరి్పస్తూ  ఫ్రాన్స్‌ మొత్తం పర్యటించారామె. ఫ్రెంచ్‌ టీవీలో ‘ఫ్రాన్స్‌ గాట్‌ ఇన్‌క్రెడిబుల్‌ టాలెంట్‌’ ్రపోగ్రామ్‌ ద్వారా దేశమంతటా యోగ విద్యను విస్తరింపచేశారు. ఆమె తాను నివసిస్తున్న చేర్‌ పట్టణంలో స్వయంగా వేలాది మందికి నేరి్పంచారు. దేశవిదేశాల్లో యోగవిద్య విస్తరించడానికి ఆమె విశేషమైన కృషి చేశారు.

ప్రాచీనమైన యోగవిద్య మనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఏకైకమార్గమని ప్రపంచానికి చాటారు చార్లోట్‌. యోగసాధనకు వయసుతో సంబంధం లేదని, అందుకు తానే పెద్ద నిదర్శనమని అనేక సందర్భాల్లో చె΄్పారామె. తన ఆరోగ్య రహస్యం యోగసాధన అని 2024, మే, 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సందర్భంగా కూడా చె΄్పారు చార్లోట్‌ చోపిన్‌.

ఇవి చదవండి: Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)