Breaking News

స్కూల్‌..! అసలు ఈ పదం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?

Published on Thu, 06/11/2026 - 11:07

ప్రస్తుతం స్కూల్‌ అని పిలువబడుతున్న ఈ పదాన్ని మొదట ఏమని పిలిచేవారో తెలుసా? అసలు ఈపదం ఎక్కడినుంచి వచ్చింది? ఎలా స్కూల్‌ గా మారింది? అనేదానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం!

"స్కూల్" అనే పదాన్ని ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనుగొనలేదు. కొన్ని భాషల్లోని పదాలు వ్యక్తులు సృష్టించినవీ కూడా కావు. శతాబ్దాలపాటు ప్రజల వాడుకలో క్రమక్రమంగా రూపుదిద్దుకున్నాయి. అలాంటి పదాల్లో నేడు వాడుకలో ఉన్నది స్కూల్‌ అనే పదమొకటి.

నేడు ఆంగ్లంలో స్కూల్‌ (School) అనే పదం ప్రాచీన గ్రీకు పదమైన "స్కోలే"(scholē) నుంచి వచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఈ గ్రీకు పదానికి మొదట్లో విశ్రాంతి సమయం లేదా ఖాళీ సమయం అనే అర్థాలు ఉండేవి. ప్రజలు వారి పనులు ముగించుకున్నాక దొరికే ఖాళీ సమయంలో చర్చలు చేయడం, తత్వశాస్త్రం నేర్చుకోవడం, జ్ఞానం సంపాదించడం చేసేవారట. స్కోలే పదానికి "విద్యాభ్యాసం", "ఉపన్యాసాలు జరిగే స్థలం" అని అర్థాలు వచ్చేవి. కాలక్రమేనా గ్రీకులో స్కోలే, లాటిన్‌లో స్కోలా, పాత ఇంగ్లీష్‌ లో స్కోల్‌ గా మారి, చివరికి ఆధునిక ఇంగ్లీష్‌ లో స్కూల్‌ గా రూపాంతరం చెందింది. అంటే నేడు మనం "స్కూల్" అని పిలిచే పదానికి అసలు అర్థం "ఖాళీ సమయంలో జ్ఞానం సంపాదించే స్థలం" అన్నమాట!

ఈ స్కూల్‌ పదం తెలుగులో చూసుకున్నట్లయితే, పూర్వకాలంలో బడి అని పిలిచేవారు. బడి అనే పదానికి అర్థం చదువు చెప్పే స్థలం, పాఠశాల అనే అర్థం. ఇది ఇంగ్లీష్ స్కూల్‌ నుంచి వచ్చిన పదం అసలే కాదు. తెలుగు భాషలో చాలా కాలంగా వాడుకలో ఉన్న స్వదేశీ పదంగా భాషావేత్తల భావన. పూర్వకాలంలో గురువు తన ఇంటి వద్ద లేదా ఖాళీస్థలంలో పిల్లలకు అక్షరాలు, లెక్కలు నేర్పేవారట. ఆ చదువు జరిగే చోటును బడి అని పిలిచేవారు. ఇప్పటికీ ఈ పదం సహజంగా వాడుకలో కొనసాగుతుంది. అయితే అధికారిక పదం పాఠశాల. పాఠం అంటే.. చదువు, శాల అంటే.. ఇల్లు లేదా స్థలం అని అర్థం. ప్రజల నిత్య వాడుకలో ఉన్న స్వచ్ఛ తెలుగు పదం బడిగా ఉంటే, సంస్కృత మూలం ఉన్న అధికారిక పదం పాఠశాల.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)