Breaking News

ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతారు!

Published on Sun, 09/24/2023 - 12:16

ఈ ప్రపంచంలో అసాధారణమైన ప్రతీది మిస్టరీనే.  మనం ఏ సపోర్ట్‌ లేకుండా ముందుకు వాలి నిలబడగలమా? బేస్‌లేకుండా ఏ వస్తువునైనా నిలబెట్టగలమా? ఎప్పుడైనా, ఎక్కడైనా ఇద్దరు వేరువేరు పొడవులు గల వ్యక్తుల ఎత్తులు సమాంతరంగా మారతాయా? ఈ వింతలన్నీ ఒకే చోట జరుగుతాయి. అమెరికాలోని ఓ మిస్టీరియస్‌ స్పాట్‌లో ఒక చీపురును నిలబెడితే.. ఏ సపోర్ట్‌ లేకుండా నిలబడుతుంది. కుర్చీ నేలకు ఆనకుండా.. గోడకు ఆనిస్తే.. అది నిలబడే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ!

యూఎస్‌లోని మిషిగన్, సెయింట్‌ ఇగ్నస్‌ ప్రాంతంలో.. ‘ది ఒరెగాన్‌ వోర్టెక్స్‌’ అనే పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే ఈ వింతలన్నిటినీ చూడొచ్చు. ఇక్కడున్న ‘ద హౌస్‌ ఆఫ్‌ మిస్టరీ’ అనే ఇంట్లోకి వెళ్తుంటే కళ్లు చెదరడం పక్కా! తూలుతూ, ఊగుతూనే ఇందులో అడుగుపెడతారంతా. ఈ ఇల్లు ఓ పక్కకు వాలి ఉంటుంది. ఈ ఇంట్లో గోడ మీద నిలబడొచ్చు! ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన రాయిని ఎక్కితే ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా కనిపిస్తాయి. నిలబడిన స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ తేడాను గమనించొచ్చు. ఇక్కడ నడిస్తే అడుగులన్నీ వాలుగానే పడుతాయి.

ఈ విచిత్రమైన ప్రదేశాన్ని 1950లో కొందరు సర్వేయర్స్‌ కనుగొన్నారు. ఇక్కడ ఎలాంటి పరికరాలూ పనిచేయవు. సుమారు 300 అడుగుల డయామీటర్‌ సర్కిల్‌లో మాత్రమే ఈ వింత గోచరిస్తుంది. జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే అంటుంటారు పర్యాటకులు. ఈ థ్రిల్‌ని ఎంజాయ్‌ చెయ్యడానికి ఇక్కడికి ఎగబడుతుంటారు ఔత్సాహికులు.  ఈ స్పాట్‌.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందట. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ఎందుకు సాధారణంగా లేదు? అనేదానికి కారణాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దాంతో ఈ ప్రదేశం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

సంహిత నిమ్మన 

(చదవండి: బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)