Breaking News

ఒంటికి మంచిదే..మరి పంటికి?

Published on Tue, 11/05/2024 - 10:47

ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. 

పండ్లు / పండ్ల రసాలతో... 
తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్‌జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు.  ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని  యాసిడ్స్‌ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.

ఈ సమస్య అధిగమించడానికి...
పండ్లను జ్యూస్‌ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్‌ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్‌ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు.  జ్యూస్‌ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గు మందులతో...  
దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్‌ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత  చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. 

ఈ సమస్య అధిగమించడానికి...
దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో  నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి. 

గుండెకు మేలు చేసే డార్క్‌ చాక్లెట్లతో...  
పరిమితంగా తీసుకునే డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్‌ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.

ఈ సమస్య అధిగమించడానికి...
చాక్లెట్లు తిన్న తర్వాత  ఆ జిగురంతా  పోయేలా వేలితో లేదా టూత్‌ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్‌ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి. 

(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)