Breaking News

రూ.10,980కే గానుగ నూనె యంత్రం

Published on Wed, 04/16/2025 - 09:46

ఆరోగ్య రక్షణలో గానుగ నూనెల ప్రాధాన్యాన్ని ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ధర ఎక్కువైనప్పటికీ ఆరోగ్యాభిలాషులు గానుగ నూనెల కొనుగోలుకు వెనుకాడటం లేదు. మన దేశంలో గానుగ నూనెల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. దీని వార్షిక వ్యాపారం (సిఎజిఆర్‌) 2024–2032 మధ్యకాలంలో సుమారు 6% పెరుగుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. ప్రజల్లో ముఖ్యంగా నగర, పట్టణవాసుల్లో గానుగ నూనెల పట్ల మక్కువ పెరగటంతో పాటు ప్రభుత్వం కూడా  ప్రోత్సహిస్తుండటంతో గానుగ నూనెల వ్యాపారానికి భవిష్యత్తులో విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. 

ఎద్దును కట్టి గానుగ తిప్పి నూనె వెలికి తీసే సంస్థలతోపాటు విద్యుత్తుతో కట్టె గానుగలు నడుపుతూ కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఎవరి ఇంట్లో వాళ్లు పెట్టుకొని నడుపుకోగలిగిన చిన్నవి, ఇంకో చోటికి సులభంగా తీసుకెళ్ల గలిగిన చిన్నపాటి గానుగ యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటి ధర, నాణ్యతలో ప్రామాణికత లోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాన్పూర్‌ ఐఐటి ఒక కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌  పోర్టబుల్‌ యంత్రాన్ని తక్కువ ధరలో రూపొందించింది. ఐఐటి కాన్పూర్‌లోని రూరల్‌ టెక్నాలజీ యాక్షన్‌ గ్రూప్‌ (రుటాగ్‌)లో ఇంక్యుబేషన్‌ సేవలు అందుకున్న డి–ఐవి ఎంటర్‌ప్రైజెస్‌ అనే స్టార్టప్‌ ఈ యంత్రాలను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి తెచ్చింది. 

ఈ యంత్రంలో మూడు భాగాలు ఉంటాయి. ఛాంబర్, ప్లంగర్‌ రాడ్, స్టెయిన్‌లెస్‌ సిలెండర్‌. అడుగున ఒక గిన్నెలో ఛాంబర్‌ను ఉంచి, అందులో నూనె గింజలు  పోసి, పైన ఉన్న హేండిల్‌ను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటే ప్లంగర్‌ రాడ్‌ కిందికి దిగుతూ గింజల్ని వత్తుతుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ సిలెండర్‌కు ఉన్న రంథ్రాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. తక్కువ విద్యుత్‌ ఖర్చుతో అధిక నాణ్యత గల నూనెను ఈ విధంగా వెలికితీయవచ్చని ఐఐటి చెబుతోంది. దీన్ని నడపడానికి విద్యుత్తు అవసరం లేదు. ఒక వ్యక్తి పెద్ద శ్రమ లేకుండానే దీనితో నూనెను వెలికితీయవచ్చు. వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, సోయా తదితర నూనె గింజల నుంచి దీనితో నూనె తీయవచ్చు. సంవత్సరం క్రితం మార్కెట్‌లోకి వచ్చిన ఈ యంత్రం ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్లింది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగలిగే ఈ యంత్రం ధర రూ. 10,980 మాత్రమే. ఇతర యంత్రాలతో పోల్చితే దీని ఖరీదు చాలా తక్కువని ఐఐటి కాన్పూర్‌ రుటాగ్‌ అధిపతి డాక్టర్‌ అమన్‌దీప్‌ సింగ్‌ చెప్పారు. 

 యంత్రం వీడియో లింక్‌: https://www.youtube.com/watch?v=0ZMNaZMMC5o

యంత్రం తయారీదారు మెయిల్‌ఐడి: divakmse@gmail.com    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)