Breaking News

డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్‌!

Published on Sun, 09/15/2024 - 10:07

డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ను ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ ఇంట్లో ఫ్రిజ్‌ లేనివారికి ఇది కొంత ఇబ్బందికరమే. వాళ్ల విషయంలో దీనికి పరిష్కారమెలా? 

ఈ అంశంపైనే పరిశోధనలు చేసి ఓ కూలింగ్‌ క్యారియర్‌ను రూపొందించిన ఒడిశా అమ్మాయి కోమల్‌ పాండాకు జేమ్స్‌ డైసన్‌ అవార్డు వరించింది. స్థానికంగా లభ్యమయ్యే సులభమైన సాంకేతికతతో కొత్త ఉపకరణాలను రూపొందించేవారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. మన దేశం నుంచి కోమల్‌ పాండాకు ఈ అవార్డుతోపాటు రూ. 5 లక్షలు బహూకరిస్తారు. కోమల్‌ రూపొందించిన ‘నోవోక్యారీస్‌’ అనే ఈ ఉపకరణంతో ఇన్సులిన్‌ను చాలాసేపు చల్లదనంలో ఉంచవచ్చు. 

అంతేకాదు దూరప్రయాణాల్లో, విద్యుత్‌ సౌకర్యాలూ, బ్యాటరీ సౌలభ్యాలు లేనిచోట్ల కూడా ఇన్సులిన్‌తోపాటు చల్లదనంలోనే ఉంచాల్సిన చాలా రకాల మందుల్ని సుదీర్ఘకాలంపాటు నిల్వ చేయవచ్చు. ‘నోవోక్యారీస్‌’ రూపకల్పనకు తన తండ్రి నుంచే కోమల్‌కు స్ఫూర్తి లభించింది. ఆయన ఓ డయాబెటిస్‌ బాధితుడు. 

ఆఫీసులో ఫ్రిజ్‌ లేదు. దూరప్రయాణాలప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఆయన మాత్రమే కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం దాదాపు 20 శాతం మందులు ఇలా దూర్రప్రాంతాలకు ప్రయాణం చేసేవారి విషయంలో, రిఫ్రిజిరేటర్‌ సౌకర్యం లేకపోవడం వల్ల చెడిపోతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంటోంది. ఇలాంటి వారికి ఇదెంతో ప్రయోజనం.    

(చదవండి:  కమ్మటి కబుర్ల కమ్యూనిటీ కిచెన్‌..! వంటరికి విస్తరి..  )

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)