Breaking News

అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్‌!

Published on Thu, 10/03/2024 - 10:33

నా వయస్సు 33 సం‘‘లు. నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి!  – ఎ. పార్వతి,హైదరాబాద్‌

జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా  పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.

శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్‌.టి.ఎమ్‌.ఎస్‌’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను వెంటనే కలవండి. ఆల్‌ ది బెస్ట్‌.

– డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి,
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)