Breaking News

బరువు నిర్వహణకు ది బెస్ట్‌ 30-30-30 రూల్‌ డైట్‌..!

Published on Fri, 01/10/2025 - 16:38

ఎన్నో రకాల డైట్‌ల గురించి విన్నాం. కానీ ఏంటిది 30-30-30 డైట్..?. కీటోజెనిక్ డైట్ నుంచి వీగన్ ప్లాన్స్, అడపాదడపా ఉపవాసం, అధిక-ప్రోటీన్ నియమాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ భోజనం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా నెంబర్ల రూల్‌తో కూడిన డైట్‌ ఏంటి..? మంచిదేనా అని సందేహించకండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు ఈ డైట్‌ నూటికి నూరు శాతం మంచిదని కితాబిస్తున్నారు. మరీ ఆ డైట్‌ ఏంటి..? అందులో ఎలాంటి ఆహారం తీసుకుంటారో చూద్దామా...

ప్రస్తుతం తీసుకునే డైట్‌లలో ఎక్కువగా అధిక బరువు సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం అనుసరించేవి. అయితే కొన్ని డైట్‌లతో తొందరగా ఫలితాలను అందుకోగలం. అదేవిధంగా అందరికీ అన్ని డైట్‌లు సరిపడవు కూడా. 

అయితే పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా చెప్పే 30-30-30 డైట్‌ మాత్రం సత్వర ఫలితాలను ఇవ్వడమే గాక తొందరగా వెయిట్‌ లాస్‌ అవ్వుతారట. నిపుణుల సైతం నూటికి నూరు మార్కుల ఇస్తున్నారు ఈ డైట్‌కి. పైగా ఇది సమర్థవంతమైనది, ఆరోగ్యకరమైన వెయిట్‌ లాస్‌ డైట్‌ అని చెబుతున్నారు. 

ఈ డైట్‌ ఎలా ఉంటుందంటే..
ఉదయం మేల్కోగానే 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్‌ తీసకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలి. మనం ఎప్పుడైతే కేలరీలను తగ్గిస్తామో.. అప్పుడు శరీరంలో ఉన్న వేస్ట్‌ కొవ్వు అదనపు శక్తి కోసం ఖర్చువుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. అలాగే ఈ డైట్‌ పరంగా చేసే శక్తిమంతమైన వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. 

ఇది ఒకరకంగా తినాలనే కోరికను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదీగాక ప్రతి ఉదయాన్ని 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్‌తో ప్రారంభిస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్‌ తీసుకోవాలనే ధ్యాస తెలియకుండానే తగ్గుతుందట. ఆటోమేటిగ్గా ఈ రూల్‌ గుర్తొచ్చి చకచక​ మన పనులు పూర్తిచేసుకునేలా మన మైండ్‌ సెట్‌ అయిపోవడంతో త్వరితగతిన ఫలితాలు అందుకుంటామని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

 

(చదవండి: దీర్ఘాయువు మందులతో ‍ దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్‌ మిలియనీర్‌)

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)