Breaking News

సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు

Published on Thu, 06/27/2024 - 18:28

సొరకాయ, ఆనపకాయ ఈ పేరు చెబితేనే  చాలా మంది పెద్దగా ఇష్టపడరు. సాంబారుకో, పులుసుకో తప్ప ఇంక దేనికీ పనికి రాదనుకుంటారు. నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ, బరువుతగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది.  సొరకాయ , దాని ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం రండి..!

కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కూరగాయసొరకాయ. ఇందులో లో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్. సొరకాయతో పలు రకాలు వంటకాలు చేసుకోవచ్చు. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

సొరకాయ జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - లాభాలు 
హైపర్‌టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌లో ఉంటుంది.
సొరకాయలో ఉండే, పొటాషియం  గుండె జబ్బులు రాకుండా  కాపాడుతుంది. 
హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు, పరగడుపున సొరకాయ జ్యూస్‌ తాగితే మంచిది. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. 


శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
సొరకాయ జ్యూస్‌ న్యాచురల్‌ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. 
ఆయుర్వేదం ప్రకారం సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
సొరకాయ జ్యూస్‌ రెగ్యులర్‌ తాగితే   మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారి పని మరింత ఈజీ అవుతుంది.

సొరకాయతో సౌందర్య ప్రయోజనాలు..!
సొరకాయ జ్యూస్‌ ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తుంది
రోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్‌ సేవిస్తే  తాగుతుంటే ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.
ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగి, యవ్వనంగా కనిపిస్తారు.
చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను, దురదలు, దద్దుర్లను తగ్గించడంలోనూ సాయపడుతుంది. 
రోజూ ఈ జ్యూస్  తాగితే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరుగుతాయి, జుట్టు మెరిసిపోతుంది.

ఎలా చేసుకోవాలి?
సొరకాయ ముక్కలు,  పుదీనా ఆకులు, అల్లంవేసి  బ్లెండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.
దీనికి ఉప్పు, మిరియాలపొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని వడపోసుకుని ఇష్టంగా తాగేయడమే.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)