Breaking News

మెనూ మారుద్దాం

Published on Sat, 09/28/2024 - 11:00

మిల్లెట్స్‌ ఆరోగ్యానికి మంచివని తెలుసు. కానీ... రోజూ తినాలంటే కష్టంగా ఉంది. దోసె రుచి కోసం నాలుక మారాం చేస్తోంది. మరేం చేద్దాం... జొన్నతో దోసె చేద్దాం. జొన్నతోనే లంచ్‌ బాక్స్‌కి కిచిడీ చేద్దాం.  ఎంచక్కా తింటూనే బరువు తగ్గుదాం.

కావలసినవి:  జొన్న పిండి – కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; రవ్వ – పావు కప్పు;  జీలకర్ర– అర టీ స్పూన్‌; పచ్చిమిర్చి– 2 (తరగాలి); అల్లం – అంగుళం ముక్క (తురమాలి); ఉప్పు – పావు టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; నూనె – టేబుల్‌ స్పూన్‌.

తయారీ: ∙ఒక వెడల్పు పాత్రలో జొన్నపిండి, బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి కలపాలి. ఇందులో దాదాపుగా మూడు కప్పుల నీటిని ΄ోసి గరిటె జారుడుగా కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే మరికొంత నీటిని చేర్చి కలిపి ఓ అరగంట సేపు నాననివ్వాలి ∙ఇప్పుడు పెనం వేడి చేసి ఒక గరిటె పిండితో దోసె వేసి, చుట్టూ పావు టీ స్పూన్‌ నూనె చిలకరించాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాల్చితే జొన్న దోసె రెడీ. ఈ దోసెలోకి వేరుశనగపప్పు చట్నీ, సాంబారు, టొమాటో పచ్చడి మంచి కాంబినేషన్‌.

జొన్న కిచిడీ
కావలసినవి: జొన్నలు›– అరకప్పు; పెసరపప్పు – పావు కప్పు; కూరగాయల ముక్కలు – కప్పు (క్యారట్, బీన్స్, బఠాణీలు కలిపి); జీలకర్ర – అర టీ స్పూన్‌; పసుపు – పావు టీ స్పూన్‌;  ఉప్పు – పావు టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; నీరు – 3 కప్పులు;  నెయ్యి లేదా నూనె – టేబుల్‌ స్పూన్‌.

తయారీ: ∙జొన్నలను కడిగి మంచి నీటిలో నాలుగు గంటల సేపు నానబెట్టాలి ∙ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి మంట తగ్గించాలి. అవి వేగిన తర్వాత అందులో కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. 

 నానిన జొన్నలను కడిగి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి ∙కూరగాయ ముక్కల పచ్చిదనం ΄ోయిన తర్వాత అందులో జొన్నలు, పెసర పప్పు, పసుపు, ఉప్పు వేసి నీటిని ΄ోసి కలిపి మూత పెట్టాలి ∙మీడియం మంట మీద ఉడికించాలి. నాలుగు విజిల్స్‌ వచ్చిన తర్వాత స్టవ్‌ ఆపేయాలి ∙ప్రెషర్‌ తగ్గిన తర్వాత మూత తీసి గరిటెతో కలిపి వేడిగా వడ్డించాలి. ఇందులోకి ఆవకాయ, పెరుగు పచ్చడి బాగుంటాయి.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)