Breaking News

చిరు జల్లులు: వేడి వేడి మొక్కజొన్నపొత్తులు, ఈ విషయాలు తెలుసా?

Published on Thu, 07/18/2024 - 13:39

సన్నని చిరు జల్లులు.. వేడి వేడి మొక్కజొన్న పొత్తులు. ఈ కాంబినేషన్‌ సూపర్‌ ఉంటుంది కదా.  కమ్మగా కాల్చిన వేడి వేడి మొక్క జొన్నపై కాస్తంత నిమ్మరసం, ఉప్పుచల్లుకొని తింటే ఆహా.. అనుకోవాల్సిందే.  మరి సీజనల్‌గా లభించే మొక్కజొన్న  ఆరోగ్య ప్రయోజనాలగురించి ఎపుడైనా ఆలోచించారా?

మొక్కజొన్న  లేదా కార్న్‌ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన తృణధాన్యాలలో ఒకటి. సెంట్రల్ అమెరికాకు చెందిన గడ్డి కుటుంబంలోనిది.  కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని రకాల్లో పెరుగుతుంది. సాధారణంగా పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు, నారింజ, ఊదా, నీలం, తెలుపు, నలుపు వంటి అనేక ఇతర రంగులలో కూడా లభిస్తుంది. 

ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియంలాంటి  ఖనిజాలు  విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల మూలం మొక్కజొన్న. మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది , ప్రేగుల క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నలో ఇనుము ఉంటుంది. ఇది  ఇనుము లోపం అనీమియాను నివారిస్తుంది.  మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరిత శక్తిని అందిస్తాయి. మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బరువు  నియంత్రణకు సహాయపడుతుంది.

మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో కంటి  చూపు మెరుగుపడుతుంది. ఇందులోని లుటిన్ , జియాక్సంతిన్  కంటి  సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.  ఇంకా  గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫోలేట్, పొటాషియం , ప్లాంట్ స్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.  గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   వీటిల్లోని ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు  ఎముకలను బలోపేతం చేస్తాయి తద్వారా ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.

మొక్కజొన్న చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సీతోపాటు , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో మన శరీరం , చర్మం  ఆరోగ్యంగా ఉంటుంది.  వృద్ధాప్య సంకేతాలను అడ్డుకుంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ గణనీయంగా తగ్గిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)