Breaking News

వెయిట్‌లాస్‌ కోసం బ్లాక్‌బస్టర్‌ ఇంజెక్షన్‌ వచ్చేసింది, ధర ఎంత అంటే!

Published on Tue, 06/24/2025 - 17:24

Wegovy Injection: అధిక బరువుతో  బాధపడుతున్న వారికి ఊరటి నిచ్చే వార్త ఇది.  డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్.. 'వెగోవీ' అనే ఇంజెక్షన్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం (జూన్‌ 24) ఈ మెడిసిన్‌ను లాంచ్‌ చేశారు.   ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని చెబుతోంది.  ఈ నెలాఖరులోగా అన్ని ఫార్మా దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. 

వీగోవీ అనే ఇంజెక్షన్‌ నాలుగు వారాల మోతాదు సైకిల్‌లోఉంటుంది. నాలుగు వారాల పాటు వారానికి 0.25 mg అతి తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక నెల పాటు వారానికి 0.5 mg మోతాదు క్రమంగా పెరుగుతుంది.  నెల పాటు వారానికి 1 mg మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడి సిఫారసు మేరకు మోతాదును మరింత పెంచాలా,  లేదా తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇది 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg ,2.4 mg ఐదు మోతాదు రూపాల్లో  మార్కెట్లోకి  లభిస్తుంది.  ఇది ఉపయోగించడానికి సులభమైన పెన్ లాంటి పరికరంగా లభిస్తుంది.

 

ధరలు వివరాలు
నోవో నార్డిస్క్ వీగోవీ  0.25 mg, 0.5 mg , 1 mg మోతాదు నెలకు రూ. 17,345 ఖర్చవుతుంది. 1.75 mg అధిక మోతాదు  ఇంజెక్షన్‌ నెలకు రూ. 24,280 ఖర్చవుతుంది. 2.4 mg మోతాదు రూ. 26,050 ఖర్చవుతుంది. 

దీర్ఘకాలిక బరువు నిర్వహణ ,హృదయ సంబంధ వ్యాధులకు వెగోవీ తొలిఏకైక బరువు నిర్వహణ ఔషధం. ఈ ఔషధం 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఇతర అనారోగ్యాలు  లేనివారికి , 27 కంటే తక్కువ BMI ఉన్న, ఇతర అనారోగ్యాలున్నా ఇస్తారు.

భారతదేశంలో వెగోవీ కోసం స్థానికంగా తయారీకి ఎటువంటి ప్రణాళికలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. నోవో నార్డిస్క్ ఇప్పటికే 2022లో భారతదేశంలో నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్‌ను  ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు