Breaking News

సీటుకు రూ. 50వేలు తగలేశాం, ఎయిరిండియాపై కమెడియన్‌ ఫైర్‌

Published on Tue, 04/15/2025 - 12:42

విమానయాన సంస్థల   సేవాలోపాలకు సంబంధించి అనేక కథనాలు,ఫిర్యాదులు గతంలో  అనేకం  చూశాం.  కొన్ని వివాదాల్ని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన  విమానయాన రెగ్యులేటరీ సంస్థ  ఆయా సంస్థలకు మొట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్‌ ఎయిరిండియా మరో వివాదం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అదీ ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది.

 

హాస్యనటుడు వీర్ దాస్ ఎయిరిండియాపై  మండిపడ్డారు.  ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు రూ.50 వేలు పోసి ఒక్కో టికెట్‌ కొన్నా ఫలితం లేదంటూ విమర్శించారు.  టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్‌లు విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో మంగళవారం ఒక పోస్ట్‌ పెట్టారు. దీంతో వైరల్‌ గా మారింది. అలాగే తన భార్య కాలు విరగడంతో ఆమెకు  సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా  వీల్‌ చైర్‌ సర్వీసు బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్‌చైర్ రాలేదని  దాస్  ఆరోపించారు. 

 

 "ప్రియమైన ఎయిరిండియా,ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్‌చైర్‌ను  మీరు తీసుకొండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుడిని."  అన్నారు. ఇదే పోస్ట్‌లో ఇంకా "విరిగిన టేబుల్, విరిగిన  లెగ్‌ రెస్ట్‌లు,  వంగిపోయిన సీటు  దుర్భరమైన ప్రయాణమని  వీర్‌ దాస్‌ పేర్కొన్నారు. విమానం రెండు గంటలు ఆలస్యం.. ముందుగానే వీల్‌చైర్ , ఎన్‌కామ్ (విమానాశ్రయాలలో మీట్-అండ్-గ్రీట్ సేవలు) ముందుగానే బుక్ చేసుకున్నాం అయినా ఫలితం లేదు. దాని గురించి  అడగడానికి అసలక్కడ ఎవరూ లేరు" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

నాలుగు బ్యాగులు మోస్తూ, సాయం చేయమని సిబ్బందిని అడిగితే, క్యాబిన్‌ సిబ్బందిగానీ, గ్రౌండ్‌ సిబ్బందిగానీ అస్సలు పట్టించుకోలేదన్నారు.  అలాగే  నొప్పితో ఉన్న తన భార్య స్టెప్‌లాడర్ ఉపయోగించి దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్‌ చైర్స్‌ కనిపిస్తున్నాయి.. కానీ ముందుగా బుక్‌ చేసుకున్న  తనకు ఆ సౌకర్యం లేదు   సిబ్బంది ఎవరూ లేరంటూ  ఆగ్రహించారు.  అందుకే  తన భార్య  కోసం ఒకటి లాక్కోవలసి వచ్చింది.అలా భార్యను లగేజ్ క్లెయిమ్‌కు తీసుకెళ్లి, అక్కడినుంచి  పార్కింగ్‌కు వెళ్లామని వివరించాడు. అలాగేఎయిర్‌పోర్ట్‌లో సెకండ్‌ఫ్లోర్‌లో మీ వీల్‌ చైర్‌ ఉంది తెచ్చుకోండి అంటూ ఎయిరిండియాకు సూచించారు. దాస్‌ పోస్ట్‌పై ఎయిరిండియా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సంబంధింత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది. 
 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)