Breaking News

సునీతా విలియమ్స్‌ మీద సింపతీలేదు : యూఎస్‌ ఖగోళ శాస్త్రవేత్త

Published on Thu, 03/20/2025 - 16:30

భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ  తరువాత వీరు  భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్‌ ప్రపంచం సెలబ్రేట్‌ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్  (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన  అలాంటి వ్యాఖ్యలు  ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్‌మీద వెళ్లి తొమ్మినెలలపాటు  చిక్కుకున్న సునీతా విలియమ్స్‌ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్‌ వ్యాఖ్యానించారు.  అయితే వారిని  భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు.  నేషనల్‌ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు.  అలాగే ఇపుడు వాళ్లకి  గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని  సూచించారు.

అయితే వారి  భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ  పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో వ్యాయామానికి  చాలా మార్గాలుంటాయి కాబట్టి  వారి  కండరాలు, చలనంపై  కూడా ఆందోళన అవసరం లేదన్నారు.  జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు  దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్‌. 

చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్‌ వస్తే? ఏలా మేనేజ్‌ చేస్తారు?

అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ  వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్‌.  అంతేకాదు సునీత, విల్మోర్  మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.

చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)