Breaking News

అడవులకే వెళ్ళాలా? మనసే కీలకం!

Published on Tue, 03/18/2025 - 15:02

పూర్వం అనుభవజ్ఞులైన ఆలోచనాపరులు జీవితానికి సంబంధించి వివిధ దశలలో వివిధ నియమాలను, జీవన పద్ధతులను నిర్దేశించి చెప్పి, ఆ పద్ధతుల ప్రకారం జీవనం సాగిస్తే జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఇహలోకం నుండి నిష్క్రమించడం కూడా అంతగా బాధ అనిపించకుండా జరుగుతుందని చెప్పారు. ఆ పద్ధతులలో ఒక వ్యక్తి గృహస్థుడిగా జీవితాన్ని గడిపి, నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నిర్వర్తించాక, వృద్ధాప్యంలో సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయి, శేషజీవితం అక్కడ గడిపి ప్రశాంతంగా ఇహలోకాన్ని వదిలి ప్రకృతిలో కలిసి పొమ్మన్నారు. అయితే, సన్యాసం స్వీకరించడం అందరూ చేయగలిగే పని కాదనీ, ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న బంధాలను ఒక్కసారిగా తెంచు కుని వెళ్ళిపోవడం ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయ్యే పనీ అని ఆచరణలో తేలింది. ఫలితంగా, అడవులకే వెళ్ళాలా? అన్న ప్రశ్న ఉదయించి, అన్నిటికీ మనసే మూలం కనుక, మనసు చేసే  ఆలోచనలను కట్టడి చేస్తే, అడవులకు వెళ్ళవలసిన పనిలేదని చెప్పుకోవడం జరిగింది. 

ఈ విషయంపై దంతులూరి బాపకవి రచించిన ‘మూర్తిత్రయో పాఖ్యానము’ ద్వితీయాశ్వాసంలో ఆసక్తికరమైన వివరణ ఉంది. ‘ఇల్లు వదిలిపెట్టి అడవులలోకి అడుగుపెట్టగానే కామ సంబంధమైన ఆలో చనలు కరిగిపోయి, బుద్ధి నిష్కామమై మిగులుతుందా? మిగలదు కదా! అలాగే క్రోధ మోహ మద మాత్సర్యాలనే లక్షణాలు కూడా జీవితంలో ఏదో ఒక క్షణం నుండి మొదలై, మరొక క్షణంలో అంత మవ్వాలని కోరుకున్నప్పుడు అంతమయ్యేవిగా ఉండవు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, తాను అలా అయిపోయానని అంటే... అతడిని మించిన మోసగాడు మరొకడు ఉండడు!’ అన్నది ఆ వివరణ సారాంశం. ఆ సందర్భంలో ముఖ్య విషయానికి ముక్తాయింపుగా ఈ క్రింది పద్యం చెప్పబడింది.

చదవండి: UoH వర్సిటీ భూములను కాపాడాలి!
 

తే. మనసు నిలుపలేని మనుజుండు వనములో
నున్నయంత మోక్షయుక్తి లేదు
వహ్నిలోన నెన్ని వారముల్‌ వైచినం
గుప్యమునకు హేమగుణము గలదె?

 

‘మనసును కట్టడి చేసుకోలేకపోతే అడవిలో ఉండి కూడా ప్రయో జనం ఏమీ కలగదు. అగ్నిలో ఎన్ని వారాల పాటు మండించి కరి గించినా కుప్యం (బంగారం, వెండి తక్క అన్యలోహం) బంగారమవు తుందా? కాదు కదా! ఆ విధంగానే ఆలోచనలను అదుపులో ఉంచు కోకుండా కొనసాగించే అడవులలో జీవనం ప్రయోజనం లేనిదిగా పరిణమిస్తుంద’ని భావం.

ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్‌ వస్తే? ఏలా మేనేజ్‌ చేస్తారు?

– భట్టు వెంకటరావు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)