Breaking News

నో మెడిసిన్స్‌,నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్‌.. నేహాధుపియా 21 డేస్‌ చాలెంజ్‌

Published on Sat, 09/27/2025 - 16:36

బాలీవుడ్‌ నటి  నేహా ధుపియా తన ఫిట్‌నెస్‌రహస్యాలను, పలు రకాల వంటకాలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటారు.  ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి,  రెసిపీలను అభిమానులను  ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజగా 21  రోజుల  చాలెంజ్‌ ప్లాన్‌ను షేర్‌ చేశారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన నేహా ధూపియా కొత్త వెల్‌నెస్ ఛాలెంజ్‌  నెటిజనులను బాగా  ఆకర్షిస్తోంది.

నో మెడిసిన్స్‌, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్‌.. కేవలం వంటగదిలో లభించే పదార్థాలతోనే మందులపై ఆధార పడకుండా  సహజంగానే ఇన్‌ఫ్లమేషన్‌ దూరంఅంటూ ఆమె పోస్ట్‌ చేశారు.  

నేహా ధూపియా తాజా పోస్ట్‌లో, నేహా ఇన్‌ఫ్లమేషన్‌తో  పోరాడటానికి 21-రోజుల ఛాలెంజ్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్గత వాపును తగ్గించడంలో సహాయపడటానికి డైటీషియన్ రిచా గంగాని 21 రోజుల పాటు రోజువారీ హల్ది-అల్లం-నిగెల్లా  సీడ్స్‌ మిశ్రమాన్ని సిఫార్సు చేశారు. 

 "21 రోజులు.. వన్‌ కమిట్‌మెంట్‌.. ఆరోగ్యకరమైన మీరు’’ అంటూ నేహా ధూపియా , రిచా గంగాని 21-రోజుల ఛాలెంజ్‌లో పాలుపంచుకోవాలని తన ఫ్యాన్స్‌ను ఆహ్వానించారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కు  ప్రయత్నం అవసరం అంటూ ఒక పోస్ట్‌ను షేర్‌ చేశారు. 21 రోజుల పాటు ఈ డ్రింక్‌ తాగి తమ అభిప్రాయాలను, ఫలితాలను షేర్‌ చేయాలని కోరారు.

 

ఈ డ్రింక్‌ కోసం కావాల్సినవి

ఒక చిన్న పచ్చి పసుపు ముక్క
1 క్యూబ్ పచ్చి అల్లం
5-7 నల్ల మిరియాలు
1 స్పూన్ నిగెల్లా విత్తనాలు (కలోంజి)

మీ దగ్గర MCT నూనె లేకపోతే
1 స్పూన్ కొబ్బరి నూనె లేదా
1 స్పూన్ నెయ్యి లేదా
1 స్పూన్ ఆలివ్ నూనె

వీటిన్నింటిని మెత్తగా గ్రైండ్‌ చేసి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్‌లలో  ఉంచి ఫ్రీజ్ చేయాలి.   వీటిని రోజుఒకటి చొప్పున ప్రతీ రోజు ఉదయం వీటిని వేడినీటిలో వేసుకుని సేవించాలి. ఇది ట్రెండీ సప్లిమెంట్ కాదని, ఇది మంచి కొవ్వు ఆమ్లాల మూలం అని రిచా లైవ్ చాట్‌లో పేర్కొన్నారు.

కాగా పసుపులో ఉండే కర్కుమిన్ , అల్లంలో ఉండే జింజెరోల్స్ వంటి సమ్మేళనాల కారణంగా పసుపు ,అల్లం చాలా కాలంగా సహజ మంట నివారణ మందులు పేరొందాయి. నల్ల మిరియాలు పసుపును బాగా గ్రహించడంలో సహాయపడతాయి. నిగెల్లా గింజలు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒత్తిడి , నష్టం నుండి రక్షిస్తాయి.  ఆరోగ్యకరమైన కొవ్వులైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె  శరీరం ఈ పోషకాలన్నింటినీ వృధాగా పోకుండా గ్రహిస్తుందంటున్నారు వైద్యులు.

ఇన్‌ఫ్లమేషన్‌ కీళ్ల నొప్పులు, అలసట , దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం,వ్యాయామం లేకపోవడం లాంటి దీన్ని మరింత దిగజారుస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది నేహా లాగే దానిని నిర్వహించడానికి సహజ మార్గాల కోసం చూస్తున్నారు.   ఇలాంటి వారి వారి శరీరం స్పందనల మీద ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)