Breaking News

దటీజ్‌ నీతా అంబానీ : ఈ బెనారసీ చీర స్పెషాల్టీ ఏంటో తెలుసా?

Published on Wed, 07/03/2024 - 16:12

సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌  ఛైర్మన్‌ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి.  పట్టు  చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే  ఆమెకు ప్రాణం. తాజాగా  తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్‌, స్టైలిష్ ‌చెవిపోగులు, బన్‌, గజ్రా (మల్లె పూల దండ)తో  ఇలా ‍ప్రతీ విషయంలో  తన ష్యాషన్‌ స్టయిల్‌ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్‌లో ఆమె లుక్‌, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది.  

అనంత్-రాధిక  వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో  జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు.  రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ  ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా  చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్‌తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్‌ను ధరించారు.  ఈ నెక్లెస్‌ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్‌తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.


కాగా సామూహిక వివాహ  వేడుకల్లో  రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్‌ పాల్గొన్నారు.  

శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను  అందించారు.  దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో  జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)