Breaking News

అనంత్‌ పెళ్లిలో హైలెట్‌గా ఏనుగు ఆకారపు డైమండ్‌ బ్రూచ్‌..ఆ డిజైన్‌లోనే ఎందుకంటే..!

Published on Fri, 07/26/2024 - 16:29

ఇటీవలే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్‌లు, కార్లు అన్ని హైలెట్‌గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్‌ పతకం అత్యంత హైలెట్‌గా నిలిచింది. ముఖేశ్‌తో సహా అనంత్‌, ఆకాశ్‌ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్‌ చేసిన ఆభరణం ధరించారంటే..

ఈ ఆభరణాన్ని కాంతిలాల్‌ ఛోటాలాల​ రూపొందించారు. అనంత్‌ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్‌ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్‌ ఎంతగానో కేర్‌ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్‌ బ్రోచ్‌లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట. 

ఈ పతకం జామ్‌నగర్‌లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్‌ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్‌ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్‌కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్‌ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు.

(చదవండి: స్టైల్‌ ఐకాన్‌ నటాషా పూనావాలా గ్లాస్‌ మాదిరి పర్సు ధర ఎంతంటే..?)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)