నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్‌..178కే : హర్ష్‌ గోయెంకా ఫన్నీ ట్వీట్‌

Published on Tue, 04/15/2025 - 10:43

అసలు కంటే నకిలీ ముద్దు ఇదీ ఇవాల్టీ ట్రెండ్‌. మార్కెట్లో  ‘రెప్లికా’ ట్రెండ్‌ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు ఇబ్బడిముబ్బడిగా నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. డిజైనర్‌ సారీ అయినా,  కోట్ల విలువ చేసే డిజైనర్‌ డైమండ్‌ నెక్లెస్‌ అయినా ఒరిజినల్‌ని మరిపించేలా రెప్లికాలు పుట్టుకొస్తున్నాయి. ఈ  కథనం  చదివితే.. ఔరా రెప్లికా అనిపించక మానదు. 

ఇక కోట్ల విలువ చేసే డైమండ్‌ నగలు అనగానే ముందుగా గుర్తొచ్చే  పేరు అంబానీ కుటుంబానికి చెందిన ఫ్యాషన్‌  ఐకాన్‌ నీతా అంబానీ పేరే. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ సందర్బంగా  జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ  పచ్చలు పొదిగిన ఓ డైమండ్ నక్లెస్ ధరించారు. దాని ఖరీదు రూ.500 కోట్లు .  దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట మళ్లీ సందడి చేస్తోంది.


విశేషమేమిటంటే ఈ నెక్లెస్ కి రెప్లికా మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.500కోట్ల విలువచేసే  నెక్లెస్, రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటున్నారా?  కానే కాదు,  కేవలం రూ.178 కి  జైపూర్‌లో  అన్‌లైన్‌ అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో  నెట్టింట వైరల్ గా మారింది.

జైపూర్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి 'నీతా అంబానీజీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది’’ అంటూ మార్కెటింగ్‌ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోను ముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ హర్ష్ వర్ధన్ గోయెంకా (2024లో) ట్వీట్‌ చేశారు. "అబ్ క్యా బోలూం! #మార్కెటింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెటిజన్లను ఇది బాగా ఆకట్టుకుంది.  దీనిపై  నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేశారు. తక్కువ ధరలకు లగ్జరీ వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ 'కాపీ చేయడంలో  ఇండియా అత్యుత్తమం' అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, 'ఇందులో తప్పేముంది భయ్యా.. అందరై తమకిష్టమైన ఫ్యాషన్‌ను ధరించడానికి అర్హులు. అందుకు డబ్బు అడ్డు రాకూడదు కదా '  అని,  కమెంట్‌ చేశారు.  'ధన్యవాదాలు, నేను నా భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతిని ఇస్తాను' అని కామెంట్ చేయడం విశేషం. అంతేకాదు  నీతా అంబానీ లాగా ఆభరణాలు ధరించాలనే చాలా మంది మహిళల కలలను నెరవేర్చినందుకు  ఆ ఆభరణాల వ్యాపారిని ప్రశంసించారు.

 

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)