Breaking News

ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్

Published on Thu, 10/17/2024 - 12:33

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగినా ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా మంచి స్టోరీ టెల్లర్‌.  ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించింది. 

కృష్ణలీల అనే పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఫీచర్ ఫిల్మ్‌లో నికితా కూడా ఒక భాగం, త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఆమె మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ అభిమాని. ఆమె గంభీరమైన వ్యవహారశైలి, తెలివితేటలంటే నికితకు అత్యంత ఇష్టమట. ఆధునికతను స్వీకరించటం తోపాటు భారతీయ వారసత్వానికి కూడా ప్రాధాన్యతి ఇచ్చే వైఖరిలో ఐశ్వర్యకు సాటిలేరని అంటోంది నికితా. 

ప్రకాశవంతమైన స్త్రీకి ఉదాహారణ ఆమె అంటూ ఐశ్వర్వరాయ్‌పై ప్రశంసలు కురిపించింది. ఇక నికిత జంతు ప్రేమికురాలు కూడా. మన అభివృద్ధి తోపాటు మనపై ఆధారపడిన జీవుల సంరక్షణ బాధ్యత కూడా మనదే అనేది ఆమె నమ్మకం. ఆశయం వద్దకు వస్తే చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది ఆమె కోరిక. 

అలాగే జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి అడిగినప్పుడు..తానేనంటూ సగర్వంగా చెప్పుకుంది. ఎందుకంటే..వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా వచ్చానా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తనకు తన భవిష్యత్తుని అందంగా రూపుదిద్దుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతుంది.  

(చదవండి: బీచ్ వెడ్డింగ్‌, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్‌)

 

#

Tags : 1

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)