Breaking News

ఆమెలో అందం, అభినయం రెండూ..! మిస్‌ ఇండియా సైతం..

Published on Wed, 09/02/2026 - 12:18

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మిస్‌వరల్డ్‌ అందాల పోటీల గ్రాండ్‌ ఫినాలో సెప్టెంబర్‌ 5, 2026న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్‌పైనే అందరి ఆశాలు, ఆకాంక్షలు. ఈ బ్యూటీ కేవలం అందగత్తె మాత్రం కాదు తనలో నటి కూడా ఉందంటూ వెండితెరపై మెరిసింది కూడా. 

ఆమె సంజీవ్ సింగ్ పర్మార్ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్రిజ్ భాషా చలనచిత్రం 'చంబల్ పార్'లో నటించింది. నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా సందర్భంగా అరాలూయెన్ సెంటర్‌లో ఈ చిత్రం ప్రీమియర్‌ ప్రదర్శన జరుపుకుంది. ఇది త్వరలో భారత్‌లో కూడా విడుదలకానుంది. అందాల పోటీల్లో పాల్గొనేవారు కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అభినయంలో కూడా సత్తా చాటగలరని చూపించడమే తన ధ్యేయమని అంటోంది నికితా. ఆ విషయంలో తనకు ప్రియాంక చోప్రా ఆదర్శం అని చెబుతోంది. 

ఎందుకుంటే ఆమె బరేలి నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి గాడ్‌ఫాదర్స్‌ అండ దండ లేకుండా అంచలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసిందని అన్నారామె. ఇక నికితా కూడా త్వరలో కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నారు. అంతేగాదు ఆమెకు కథలు చెప్పడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఆమె ఇటీవలే కృష్ణ లీల' అనే పేరుతో 250 పేజీల రచన  చేసినట్లు సమాచారం ఇక మిస్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ సైతం నికితాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. ఫెమినా మిస్ ఇండియా వేదిక నుంచి అత్యున్నత ప్రపంచ వేదిక వరకు నికితాపోర్వాల్‌ తన మిస్‌ వరల్డ్‌ ప్రయాణంలో ప్రతి అడుగులో భారతదేశ స్ఫూర్తిని, బలాన్ని, కథను ముందుకు తీసుకువెళ్లారు. 

ఈ 75వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ప్రపంచ వేదికపై లక్షలాది ఆశలు, ఆశీస్సులు, అభినందనలను స్వదేశం నుంచి వియత్నాం వరకు ఆమెతోపాటు వస్తాయని పేర్కొంది.  కాగా నిఖితా పోర్వాల్‌ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మోడల్‌. ఆమె 18 ఏళ్ల వయసులో మీడియా రంగంలో కెరీర్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లపాటు ఆమె టీవీ యాంకర్‌గా పనిచేశారు. అలాగే ఆరేళ్లపాటు నటనలో శిక్షణ తీసుకున్నారామె. ఇక ఇప్పటికే ప్రారంభమైన ఈ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో నికితా ఇండియా శాష్‌ను అందుకున్నారు. 

నిజంగా ఇది చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే తండ్రి లేదా తల్లి పేరుతో కాకుండా నాదేశం పేరుతో వచ్చే ఐడెంటిటీ అంటే ఆ ఫీలే వేరేలెవెల్‌ అని అంటోంది నికితా. కాగా ఈ ఫైనలిస్ట్‌ జాబితాలో ఇండోనేషియా, లావోస్, మలేషియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్‌, ఆసియా, ఓషియానియ మల్టిమీడియా చోటు దక్కించుకోగా భారత్‌ ఇంకా బెర్త్‌ ఖరారు చేసుకోలేదు.

 

 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)