నిరాశకు చెక్‌ పెట్టి...

Published on Tue, 08/11/2026 - 04:35

పదే పదే పరాజయమే పలకరిస్తూ ఉండడంతో నిరాశలోకి జారిపోయి.. ‘ఇక ఆడింది చాలు’ అని చెస్‌కు టాటా చెప్పేద్దాం అనుకుంటున్న సమయంలో... తల్లిదండ్రులు, కోచ్‌ మాటల వెలుగు ఆమె మదికి చేరింది. ‘ఈసారి ఓడిపోయినా, వచ్చేసారి కచ్చితంగా గెలుస్తాను’ అనే క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది గుంటూరుకు చెందిన నిహారిక చల్లా. తాజా విషయానికి వస్తే... ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (మహిళా అంతర్జాతీయ మాస్టర్‌) హోదా సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. స్పెయిన్‌లోని పోంటెవెడ్రా మాస్టర్స్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో మూడవ నార్మ్‌తో ఈ ఘనత సాధించింది నిహారిక.

కొన్ని సంవత్సరాల క్రితం...
తండ్రి రమేష్‌తో సరదాగా చెస్‌ ఆడడం మొదలుపెట్టింది నిహారిక. ఈ క్రమంలో కూతురిలోని ప్రతిభను గుర్తించిన తండ్రి గుంటూరులోని ‘రవీంద్ర రాజు అకాడమీ ఆఫ్‌ చెస్‌ ఎడ్యుకేషన్‌’లో చేర్పించారు. కోచ్‌ రవీంద్ర రాజు శిక్షణలో తన ఆట తీరును మరింతగా మెరుగు పరుచుకోవడం మొదలుపెట్టింది నిహారిక. 
నిహారిక పట్టుదల, ఆటలో చురుకుదనం గమనించిన కోచ్‌ ప్రతి రోజూ ఆరు నుంచి ఏడు గంటలు సాధన చేయించే వారు. ఒకవైపు ఎంబిఏ చదువు, మరోవైపు చదరంగ సాధన... దీంతో ఆమెకు సరదా సమయాలు అంటూ లేకుండా పోయాయి. మొబైల్‌ ఫోన్లు, టీవి చూడడం లాంటి వాటికి చాలా తక్కువ సమయం కేటాయించేది. 
చెస్‌ ఆపేద్దామని...
‘ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌’ అయ్యేందుకు దేశవిదేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. 2023లో పోలెండ్‌లో జరిగిన టోర్నీలో 9 రౌండ్లకు గాను నిహారిక  కేవలం ఒక్క పాయింటే గెలుచుకుంది. దీంతో ఆమెను నిరాశ ఆవరించింది.
ఆ బాధలోనే ‘ఇక చెస్‌ వదిలేద్దాం అనుకుంటున్నాను’ అన్నది కుటుంబ సభ్యులతో.
‘ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. నువ్వు గెలిచే రోజు కచ్చితంగా వస్తుంది’ అని చెప్పారు తల్లిదండ్రులు.
‘విజేతల వెనకాల కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటుకునే విజయాలు సాధించారు’ అంటూ ఎంతోమంది ప్రముఖ చెస్‌ ఛాంపియన్‌ల గురించి చెప్పారు కోచ్‌ రవీంద్ర రాజు.
కుటుంబ సభ్యులు, కోచ్‌ మాటలు నిహారికలో కొత్త కాంతిని, ఉత్తేజాన్ని నింపాయి.
మళ్లీ పూర్వ ఉత్సాహంతో ఆడడం మొదలు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అద్భుత విజయాలు సాధించింది. తాజాగా ‘ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌’ హోదా గెలుచుకుంది.

నా కల... గ్రాండ్‌ మాస్టర్‌
విజయాలు సాధించాలంటే ఓటములను తట్టుకునే శక్తిని పెం΄÷ందించుకోవాలి. ప్రతి ఓటమినీ అద్భుతమైన పాఠం కిందే తీసుకున్నాను. సమయాన్ని సమర్థంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల రోజుకు ఆరు గంటల చెస్‌ సాధనతో ‘ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌’ హోదా సాధించాను. 80 ప్లస్‌ మార్కులతో ఎంబిఏ పూర్తి చేసాను. కాస్పరోవ్, హంపీ నా అభిమాన ప్లేయర్స్‌. జియం ఆవడమే నా లక్ష్యం.
– నిహారిక చల్లా

 – మురమళ్ళ శ్రీనివాసరావు, 
సాక్షి స్పోర్ట్స్, గుంటూరు
ఫొటోలు: గజ్జల రామ్‌గోపాల్‌ రెడ్డి

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)