Breaking News

మిస్‌ ఇండియా మిస్సవ్వదు..

Published on Sat, 09/21/2024 - 06:48

బ్యూటీ పేజెంట్స్, ఫ్యాషన్‌ కాంపిటీషన్స్‌ అంటే కేవలం అందం, సౌందర్యం మాత్రమే కాదని.., నిత్య జీవితంలో మన ఆలోచనా విధానం, సామాజిక అవగాహన, మానవీయ విలువలు తదితర అంశాలతో సంపూర్ణ  వ్యక్తిత్వమే ‘మిస్‌ క్రౌన్‌’కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమినా మిస్‌ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి, భవ్య రెడ్డి తెలిపారు. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్, లండన్‌ ఫ్యాషన్‌ వీక్, దుబాయ్‌ ఫ్యాషన్‌ వీక్, లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్‌లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్‌ ఆధ్వర్యంలో ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ ప్రకృతి కంభం, ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ భవ్య రెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు.  
 

మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్‌ 
ఇండియా 2024 పోటీల్లో ఈ ఇరువురూ తెలుగు రాష్ట్రాల తరపున పోటీ పడనున్న నేపథ్యంలో ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్‌ తదితర అంశాలపై వారి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఇరువురినీ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ సరస్వత్‌ ప్రత్యేకంగా అభినందించారు.  

డ్రెస్‌లు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు.. 
దక్షిణాది అమ్మాయిలకు బ్యూటీ పేజెంట్స్‌లో గుర్తింపు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు. యువతలో పరిపక్వత పెరిగింది. కానీ అవగాహన పెరగాలి. పిల్లలు ఫ్యాషన్‌ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే ఇబ్బందిగా భావిస్తున్నారు. మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ ఫ్యాషన్, మోడలింగ్, సినిమాలు అనే సరికి సమాజం సులభంగా జడ్జ్‌ చేస్తున్నారు. 

మోడ్రన్‌ డ్రెస్‌లు మా వ్యక్తిత్వానికి ప్రతీక కాదు. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి రాగలిగాము. మా సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో చూస్తే తెలుస్తుంది.. సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తున్నామనేది. నార్త్‌ ష్యాషన్‌ ఔత్సాహికులను సైతం హైదరాబాద్‌ అక్కున చేర్చుకుంటోంది. దక్షిణాదిలో సృజనాత్మకత, ఐడియాలజీ, నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటారు. అదే రీతిలో మనవారినీ ప్రోత్సహించాలి. ఈ రంగంలో బాహ్య, అంతర సౌందర్యం రెండూ ముఖ్యమే. మన రంగూ, రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవు. ఆలోచనా విధానం, అవగాహన ఇందులో కీలకాంశాలు. – ప్రకృతి కంభం.

అలాంటి రోజులు రావాలి..
ఈ రోజు సెషన్‌లో ఎంతో మంది ఫ్యాషన్‌ ఔత్సాహికులు.. వారి ప్రయాణాన్ని తమ కుటుంబ సభ్యులే ఒప్పుకోవట్లేదని, ఫ్యాషన్, మోడలింగ్‌ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని వారిస్తున్నారు. కానీ మాలాంటి అవగాహన, పరిపక్వత, నైపుణ్యాలు ఉన్న అమ్మాయిలు దొరకడం వారి అదృష్టం అని తెలుసుకునే రోజులు రావలి. వ్యవస్థనో, ఫ్యాషన్‌ పరిశ్రమపై పడిన ముద్ర మమ్మల్ని డిసైడ్‌ చేయలేవు. కళాత్మకత, సేవ, విద్య, సామాజిక విలువలు తదితర అంశాల్లో మేమెంతో ఉన్నతంగా ఆలోచిస్తాం. కెమెరా, వీఎఫ్‌ఎక్స్, డైరెక్షన్, సినిమాలు, యాక్టింగ్‌ అంటూ బాలీవుడ్‌ వరకూ ఎందరో నగరానకి వస్తున్నారు. కొందరి లోపాలు ఎంచుకుని పరిశ్రమను నిర్ధారిస్తున్నారంటే అది అవగాహనా లోపమే. 

అందుకే ఎంతో ఇష్టమున్నా రాణించలేకపోతున్నారు. పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది. ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ, పూర్తిగా లేదు అనలేము. గతంలో ఒక ఆటో డ్రైవర్‌ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలున్నాయి. పోటీలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్‌గా స్థిరంగా ఉంటూ, గ్లోబల్‌ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయతి్నస్తున్నాం. దేశంలో ఫెమినా మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి. సాధారణంగా జరిగే పేజెంట్‌లో పాల్గొనే సమయంలో ఇంతకు ముందు విజేతల ప్రొఫైల్స్‌ తప్పకుండా 
గమనించాలి.

 – భవ్య రెడ్డి 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)