Breaking News

‘కంపెనీని నిర్మించాను, మారథాన్‌ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..

Published on Thu, 06/18/2026 - 16:29

ఓ అమ్మాయి కెరీర్‌, అభిరుచుల పరంగా సక్సెస్‌ అయినా ఆమె అమ్మమ్మ మాత్రం తన కారణంగా ఏదో కోల్పోయానంటూ బాధపడిపోయిందంటూ షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాపం ఆ అమ్మమ్మ చెప్పిన కారణం విని ఆమెకు చాలా హాస్యస్పదంగా ఉండటమే కాదు ఆ రెండు అక్షరాల పదం మందు ఆ అమ్మాయ్‌ విజయాలన్ని వృధాగా మారిపోవడం విచిత్రం. ఒక రకంగా ఈ పోస్ట్‌ మహిళల వ్యక్తిగత గుర్తింపుకి ఏ మాత్రం విలువ ఉండదా అనే విషయం తెరపైకి తీసుకొచ్చింది. అంతేగాదు ఆడపిల్లకు వివాహ బంధమే ముఖ్యమా అనే దానిపై ఆలోచింపచేసేలా క్లారిటీ ఇచ్చింది ఆ వీడియో సంభాషణ. 

ఆ అమ్మాయే భారత సంతతి మహిళ హేమాక్షి మోట్కా. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.ఆ వీడియోలో హేమాక్షి భారత దేశంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ తన గురించి వివరించారామె. భారత్‌లో ఒక కార్యక్రమానికి తన అమ్మమ్మ హాజరైందని అక్కడ కేవలం "పెళ్లైన కుమార్తెలకు" మాత్రమే సాంప్రదాయ బహుమతులుగా దుప్పట్లు లభించడంతో ఆమె అమ్మమ్మ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది. 

ఇదంతా ఎందుకంటే తనకింక పెళ్లికాకపోవడంతో అమ్మమ్మ ఆ దుప్పటి అందుకోలేకపోయానంటూ తన ఆవేదన వెలిబుచ్చిందని తెలిపింది. తనకు పెళ్లి కాలేదన్న కారణంగానే ఒక్క దుప్పటి కూడా అందుకోలేకపోయానని బాధపడుతోందామె. కానీ నాకు అది ఎంతో సిల్లీగా అనిపించింది. తాను అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో కోట్లాది రూపాయ కంపెనీ నిర్మించాను, సీఈవోని, పైగా 42 కిలోమీటర్ల  మారథాన్‌ని విజయవంతంగా పూర్తి చేశా. ఇంత సక్సెస్‌ని అందుకున్నా.. కానీ జస్ట్‌ ఒక లాంఛనప్రాయమైన దుప్పటి కోసం కోల్పోయాను కాబోలు అంటూ నవ్వేసిందామె. 

అంతేగాదు ఇది తనపై అమ్మమ్మ చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధే కావొచ్చు..కానీ మహిళలకు వ్యక్తిగత గుర్తింపును త్యాగం చేయొద్దని హెచ్చరిస్తూ ఇలా పేర్కొంది. నాకు మా అమ్మమ్మ మాటలు నవ్వు తెప్పించినా.. మహిళలుగా మనం ఎంచుకున్న రంగంలోని విజయాలను జరుపుకోవాలి. పెళ్లి అనేది ఒక ప్రతిపాద, ఆమోదం అంతే. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని..మంచి కెరీర్‌ని నిర్మించుకోవాలి, రిస్కులు తీసుకోవాలి, స్వంతంగా డబ్బు సముపార్జించాలి. గర్వపడే జీవితాన్ని సృష్టించుకోవాలి. అందుకు తగ్గట్టుగా బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటూ న్యూయార్క్‌ కంపెనీ సీఈవో అంటూ తన సంభాషణను ముగించింది. 

అంతేగాదు ఆ వీడియోలో మన హోదాకి విలువలేకపోవచ్చు, ఇతరుల అభిప్రాయాలు మారవచ్చు.. కానీ మీపై మీకు సడలని ఆత్మవిశ్వాసం ఉండాలి, దుప్పటి బాగుంటుందేమో..కానీ మీ వెంట వచ్చేది, మిమ్మల్ని నిలబెట్టేది ఆత్మవిశ్వాసమే. అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్‌ చేసింది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దదతిస్తూ.. ఆట మార్చేయండి. మీకు నచ్చిన పనులను మీ పద్ధతిలో చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం అంటూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి:  90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్‌ సాహసం..! ఇవాళ అదే..)


 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)