Breaking News

న్యూ ఇయర్‌ ట్రెండ్‌..ఈ రాత్రికి '12 గ్రేప్స్' ట్రై చేసి చూస్తారా..!

Published on Tue, 12/31/2024 - 17:22

ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్‌ రాగానే  మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్‌ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..

న్యూ ఇయర్‌(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్‌ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్‌ అవుతోంది సోషల్‌ డియాలో. 

ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్‌ తినండి అంటూ ఓ ట్రెండ్‌ ఊపందుకుంది. 

12 పండ్లే ఎందుకంటే..
ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్‌ కల్చర్‌లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్‌ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి. 

ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్‌ మీడియాలో ఈ ట్రెండ్‌పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్‌ని అడాప్ట్‌ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి  పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 

ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్‌ చేసుకుని ఖుషీగా ఉందాం. 

(చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!)
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)