Breaking News

న్యూ ఇయర్‌ రోజున ఇవి తింటే..అదృష్టానికి, డబ్బుకి ఢోకా ఉండదట!

Published on Mon, 01/01/2024 - 11:45

కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఈ న్యూ ఇయర్‌ని తమదైన పద్ధతిలో ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సంతోషకరంగా సాగిపోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే మంచిగా ప్లాన్‌ చేసుకుంటారు కూడా. అయితే కొత్త ఏడాది రోజున ఇవి తింటే ఏడాదంతా అదృష్టం కలిసొచ్చి సంతోషకరంగా సాగుతుందని కొన్ని దేశాల ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందామా!

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అంతా కలిసి సెలబ్రెట్‌ చేసుకునేది మాత్రం న్యూ ఇయర్‌ నాడే. ఈ రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ న్యూ ఇయర్‌ని ప్రారంభిస్తే ఆ ఏడాదంతా బావుండటమే కాకుండా అదృష్టం వస్తుందని కొందరి ప్రగాఢి నమ్మకం. ఇంతకీ మరీ ఈ రోజు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలంటే..

ద్రాక్ష ప్రేమను: స్పెయిన్‌, లాటిన్‌ అమెరిక దేశాలలో న్యూఇయర్‌ రోజున వీటిని తినడం అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా న్యూ ఇయర్‌ రోజు ద్రాక్ష తింటే ప్రతి నెలా అదృష్ట కలిసొస్తుందని ఒక నమ్మకం కూడా. అంతేగాదు సోషల్‌ మీడియాలో దాదాపు 12 ద్రాక్ష పండ్లను తింటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలుస్తారనే ట్రెండ్‌ తెగ నడుస్తోంది కూడా.

కాయధాన్యాలు దీర్ఘాయుష్షును: ఈ రోజున పప్పుతో చేసిన రెసిపీలు లేదా సూప్‌ తినడం మంచిదట. ముఖ్యంగా ఇలా తింటే ఆర్థిక సమృద్ధి పుష్కలంగా ఉంటుందని భావిస్తారు.  ఇటలీలో ఎక్కువగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. 

దానిమ్మ పండు సంతానం: గ్రీకు సంప్రదాయంలో దానిమ్మని  సంతానోత్పత్తి, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్‌ రోజున ఇవి తింటే సంతానం, సంపద, అదృష్టం వస్తాయని ఎక్కువమంది నమ్ముతారు. 

చేపలు తింటే లక్కు: వివిధ సంస్కృతుల్లో చేపలను అదృష్టవంతమైన వాటిగా పరిగణిస్తారు. అవి పురోగతి, సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారట. అందుకే కొన్ని ప్రదేశాల్లో నూతన సంవత్సరం రోజున చేపలు తినడంతో ప్రారంభిస్తారట కూడా. 

ఆకుకూరలు సంపదలు ఇస్తాయి: యూఎస్‌ఏలోని అనేక కుటుంబాలు కొల్లార్డ్‌ గ్రీన్స్‌ లేదా క్యాబేజీ వంటి ఆకుకూరలను తినడంతో న్యూ ఇయర్‌ రోజుని ప్రారంభిస్తారు. అలా చేస్తే సంపదలు పెరుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ఆకుపచ్చ రంగును సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆరోజు ఆకుకూరలు తింటే ఆర్థిక సమస్యలనేవే ఉండవనేది వారి విశ్వాసం. 

నూడుల్స్‌ అదృష్టాన్ని తెస్తాయి: చైనాలో పొడవైన నూడుల్స్ దీర్ఘాయువును సూచిస్తాయి. అందువల్ల న్యూ ఇయర్‌ రోజున న్యూడిల్స్‌ తింటే దీర్ఘాఆయుష్షు ఉంటుందనేది వారి నమ్మకం. చైనా సంస్కృతి ప్రకారం ఆ రోజు ఇవి తింటే అదృష్టం వస్తుందని చెబుతారు. 

కేక్‌ లేదా డోనట్స్‌: గుండ్రని ఆకారంలో మధ్యలో చిల్లు ఉండే ఇవి తింటే సంవత్సరాంతం బాగుటుందని, లక్‌ కలిసోస్తుందని కొందరూ భావిస్తారు. 

(చదవండి: 'ఆరెంజ్‌ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్‌! వీడియో వైరల్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)