Breaking News

ముంచుకొస్తున్న ఎక్స్‌ఈసీ కోవిడ్‌ వేరియంట్‌..ఏకంగా 27 దేశాలకు..!

Published on Wed, 09/18/2024 - 14:31

కోవిడ్‌-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్‌ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్‌ వంటి రకరకాల సబ్‌వేరియంట్‌లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది. 

ఇప్పుడు మళ్లీ ఎక్స్‌ఈసీ అనే కొత్త వేరియంట్‌ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసుని జర్మన్‌లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్‌, డెన్మార్క్‌, పోలాండ్‌, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్‌లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్‌, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లో కూడా ఈ వైరస్‌ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు. 

ఈ ఎక్స్‌ఈసీ కోవిడ్‌ వేరియంట్‌ని ఓమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ హైబ్రిడ్‌ కేఎస్‌ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్‌లోని జెనెటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్  మాట్లాడుతూ.. ఇతర కోవిడ్‌ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్‌ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషనల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్‌ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది. 

ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్‌ఈసీ కరోనా కొత్త వేరియంట్‌  ఓమిక్రాన్‌ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్‌ల, బూస్టర్‌ డోస్‌లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు.  కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని  సూచించింది.

ఎక్స్‌ఈసీ లక్షణాలు..
జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 

(చదవండి: అత్యంత సంపన్న మేకప్‌ ఆర్టిస్ట్‌..ఎంత ఛార్జ్‌ చేస్తాడంటే..?)
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)