Breaking News

వామ్మో.. ఇది కూడా కూలరేనా?

Published on Tue, 06/11/2024 - 13:18

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్‌ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..

ఇన్‌స్టాగ్రామ్‌లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.

ఈ కూలర్‌ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్‌తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్‌ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు.


 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)