Breaking News

స్టయిల్‌ను మడతపెడుతున్నారా?

Published on Sun, 07/19/2026 - 11:30

షర్ట్‌ మడతేస్తే.. మాస్‌ కాదు. కరెక్ట్‌గా వేస్తే క్లాస్‌ కూడా! షర్ట్‌ వేసుకున్నాక స్లీవ్స్‌ను మడతపెట్టడం ప్రతి అబ్బాయి చేసే పని. కాని, చాలామంది ఇప్పటికీ పాత పద్ధతిలో ఫాలో అవుతూ.. షర్ట్‌ చేతులతో పాటు స్టయిల్‌ను కూడా మడతపెట్టేస్తుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్స్‌ తెలుసుకోవాల్సిందే.

ఇదే అసలు స్లీవ్‌ హ్యాక్‌!
స్లీవ్స్‌ను ఒక్కో మడతగా పైకి చుడుతూ టైమ్‌ వేస్ట్‌ చేయొద్దు. షర్ట్‌ కఫ్‌ను పట్టుకుని ఒకేసారి మోచేతి వరకు పైకి లాగండి. ఇప్పుడు కింద మిగిలిన ఫ్యాబ్రిక్‌ను ఒక్కసారి మడత వేయండి... అంతే! స్లీవ్స్‌ బిగుసుకుపోవు, రోజంతా కంఫర్ట్‌గా ఉంటాయి, పైగా షర్ట్‌ ఫిట్‌గా, షార్ప్‌గా కూడా కనిపిస్తుంది. సాయంత్రం మళ్లీ స్లీవ్స్‌ను దించాలనిపిస్తే కఫ్‌ను ఒక్కసారి కిందకు లాగితే చాలు. మడతలు విప్పడానికి కుస్తీలు పట్టాల్సిన పనిలేదు!

ఏ సందర్భానికి ఏ రోల్‌?

  • క్లాసిక్‌ రోల్‌ – ఎప్పటికీ హిట్‌! రెండు లేదా మూడు మడతలు వేసి మోచేతి కింద ఆపేస్తే చాలు. ఆఫీస్, కాలేజ్, క్యాజువల్‌ మీట్‌... ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్‌. చినో ట్రౌజర్స్, తెల్లటి స్నీకర్స్, చేతికి మెటల్‌ వాచ్‌ జోడిస్తే లుక్‌ ఒక రేంజ్‌లో ఉంటుంది.

  • ఇటాలియన్‌  రోల్‌ – జెంటిల్‌మన్‌ ల సీక్రెట్‌!: కఫ్‌ బయటకు కనిపిస్తూ ఉండటమే ఈ స్టయిల్‌ స్పెషల్‌. లినెన్‌ , ఆక్స్‌ఫర్డ్‌ షర్ట్‌లకు సూపర్‌గా సెట్‌ అవుతుంది. చేతికి లెదర్‌ స్ట్రాప్‌ వాచ్‌ ఉంటే,  స్టయిల్‌కు అడ్రెస్‌లా మారిపోతారు.

  • హాఫ్‌ రోల్‌ – డేట్‌ నైట్‌ స్పెషల్‌!: మరీ పైకి మడతపెట్టకుండా, కఫ్‌ను ఒక్కటి లేదా రెండు మడతలు మాత్రమే వేయండి. రిలాక్స్‌డ్‌గా కనిపిస్తూనే క్లాస్‌ను మెయింటైన్‌  చేస్తుంది. డార్క్‌ చినో, లోఫర్స్, తేలికపాటి పెర్ఫ్యూమ్‌... అంతే, కాన్ఫిడెన్స్‌ కూడా మీతో పాటు నడుస్తుంది.

  • హై రోల్‌ – వర్క్‌ మోడ్‌ ఆన్‌ !: మోచేతి పైన వరకు స్లీవ్స్‌ను మడతపెడితే పని చేయడానికి చేతులు ఫ్రీగా ఉంటాయి. కానీ... మీటింగ్‌లో ఇలా వెళ్తే ‘ఇప్పుడే పెయింటింగ్‌ వేసి వచ్చారా?’ అనిపించే చాన్‌ ్స ఉంది. కాబట్టి ఈ స్టయిల్‌ను సందర్భాన్ని బట్టి మాత్రమే ఎంచుకోండి.

  • వన్‌  ఫోల్డ్‌ – మినిమల్‌ మ్యాజిక్‌!: డెనిమ్‌ లేదా మందమైన షర్ట్‌లకు ఒక్క 
    మడత చాలు. ఎక్కువగా మడతపెడితే షర్ట్‌ కంటే స్లీవ్స్‌కే ఎక్కువ బిల్డప్‌ ఇచ్చినట్టు కనిపిస్తుంది!

ఎక్స్‌పర్ట్స్‌ చెప్పేదేంటంటే...?
స్లీవ్స్‌ను ఎప్పుడూ మోచేతి కింద లేదా మోచేతి దగ్గర ఆపితేనే బ్యాలెన్‌ ్సడ్‌ లుక్‌ వస్తుంది. రెండు చేతుల మడతలు ఒకే ఎత్తులో ఉండాలి. ఒకటి పైకి... ఒకటి కిందకి ఉంటే అది స్టయిల్‌ కాదు... తొందరపాటు!

అలాగే, స్లీవ్స్‌ను బిగుతుగా చుట్టేయొద్దు. చేతికి వాచ్‌ లేదా బ్రేస్‌లెట్‌ ఉంటే వాటిని దాచేయొద్దు... అవే మీ లుక్‌కు చిన్న హైలైట్‌. అయితే బ్లేజర్‌ లేదా కోట్‌తో మాత్రం స్లీవ్స్‌ మడతపెట్టే ప్రయోగాలు వద్దు. అలాగే ఐదు, ఆరు మడతలు వేసి చేతులను మమ్మీలా చుట్టేయడం, ఒక చేతికి మాత్రమే మడతపెట్టడం, ప్రతి షర్ట్‌కీ ఒకే ఫోల్డ్‌ వేయడం, భుజాల వరకూ స్లీవ్స్‌ను ఎక్కించి ‘జిమ్‌ నుంచి ఇప్పుడే వచ్చా!’ అన్నట్టు తిరగడం లాంటి తప్పులు చేయకండి. ఫ్యాషన్‌  అంటే ఖరీదైన బట్టలు మాత్రమే కాదు, వాటిని ఎలా క్యారీ చేస్తామన్నదే. షర్ట్‌ స్లీవ్స్‌ కూడా అందులో భాగమే. చిన్న ఫోల్డ్‌ కూడా మీ మొత్తం లుక్‌ను మార్చేస్తుంది!
- కొండి దీపిక

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)