Breaking News

నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు

Published on Sun, 07/02/2023 - 12:54

జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో  పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్‌ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి,  వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్‌ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు.

ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్‌లు ఉంటాయి.

నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్‌ విభాగాలు, లైటింగ్‌ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే.

బ్రిటన్‌ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్‌ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్‌ అధికారులు. 

(చదవండి:  యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం)

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)