Breaking News

ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?

Published on Wed, 09/18/2024 - 15:49

మనం సాధారణంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తింటుంటాం. ఈ మధ్య స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలొచ్చక క్షణాల్లో ఫుడ్‌ మనముందు ఉంటోంది. ఏ సమయమైన మనకునచ్చింది ఆర్డర్‌ పెట్టుకుని చిటికెలో తినేయొచ్చు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా బాగా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది తినగ మిగిలింది అదే డెలివరీ బాక్స్‌లో పెట్టి పడేస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. దీనిపై అవగాహాన కల్పిస్తూ ఇద్దరు డిజటల్‌ క్రియేటర్స్‌ ఓ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఆ ఇద్దరు క్రియేటర్స్‌ ఓ పేపర్‌ బ్యాగ్‌లో ప్లాస్టిక్‌ బాక్స్‌లో ఉంచిన రెండు రోజుల కిందట ఆహారాన్ని ఉంచి వాసనను చూడమంటూ పలువురి ఇస్తారు. వారంతా ఛీ..య్యాక్‌ అంటూ ఏంటిది అని అడుగుతారు. అదేంటో గెస్‌ చేయమని వారందర్నీ అడగగా..మురికి, టాయిలెట్లు, విరేచనాలకు సంబంధించనదిగా రకరకాలుగా వర్ణించి మరీ చెబుతారు. 

ఆ తర్వాత ఆ డిజిటల్‌ క్రియేటర్‌లు అదేంటనేది చివర్లో చూపించగా.. అంత విస్తుపోతారు. మనమంతా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ని ఆర్డర్‌ చేసుకుని తింటున్నాం బాగానే ఉంది.  కానీ మిగిలింది ఆ డెలివరీ బాక్స్‌లోనే ఉంచి పడేస్తున్నాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల దుర్వాసన తోపాటు పలు రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తారు. మనం ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని డెస్ట్‌ బెన్‌లో పడేసి ఆ తర్వాత ప్లాస్టిక్‌ బాక్స్‌ని క్లీన్‌ చేసి పడేయాలి. 

అప్పుడే అది రీసైకిలింగ్‌కి పనికి వస్తుంది. అంతేగాదు మనం ఇలా చేస్తే వ్యర్థాలను సేకరించేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం ఉండదంటూ ఆ వీడియోలో ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలామంది మాకు ఇలా అవుతుందని తెలియదు, తప్పక మార్చుకుంటామని చెప్పగా, కొందరూ "వ్యర్థాల నిర్వహణను మన విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. దీనివల్ల తరువాతి తరాలు బాధ్యతయుతంగా వ్యవహరించడం, పునర్వినియోగం గురించి తెలుసుకోగలుగుతారంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ముంచుకొస్తున్న ఎక్స్‌ఈసీ కోవిడ్‌ వేరియంట్‌..ఏకంగా 27 దేశాలకు..!)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)