Breaking News

మూరెడు పూల మూల్యం లక్షకు పైగానే!

Published on Tue, 09/09/2025 - 00:26

మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో  పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్‌ విషయంలో అదే జరిగింది. 

ఓనమ్‌ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత  తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్‌లో పెట్టుకుందట. మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో ‘కష్టమ్స్‌’ అధికారులు ఆమె బ్యాగ్‌ను చెక్‌ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్‌ డాలర్ల జరిమానా విధించారట. 

(మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట. 

ఈ విషయాన్ని నటి నవ్య సోషల్‌ మీడియా లో షేర్‌ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్‌ చేసింది. ఆమె పోస్ట్‌ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది! 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)