Breaking News

61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ.. జస్ట్‌ ఐదు నెలల్లోనే..

Published on Thu, 01/30/2025 - 16:15

భారత మాజీ క్రికెటర్(former cricketer), రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత(Television presenter) నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ(Navjot Singh Sidhu) బరువు తగ్గినట్లు సోషల్‌ మీడియాలో తెలిపారు. అలాగే అంతకుమునుపు, బరువు తగ్గాక తన ఫోటోలను కూడా షేర్‌ చేశారు. తానెలా తక్కువ సమయంలో బరువు తగ్గి స్మార్ట్‌గా మారారో, అందుకు ఉపకరించినవి ఏంటో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.

బరువు తగ్గడం అనేది సంకల్ప శక్తి, ధృఢసంకల్పం, క్రమశిక్షిణతో కూడిన ప్రక్రియ. ఆరోగ్యకరమైన జీవనశైలి మొత్తం బరువుని అదుపులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తనకు ఈ ఫిట్‌నెస్‌ లక్ష్యాన్ని సాధించడంలో ఆహారం, ప్రాణాయామం, వాకింగ్‌ ఎలా ఉపయోగపడ్డాయో తెలిపారు.

సిద్ధూ దినచర్యలో..

ప్రాణాయామం(pranayam,)..
ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణ సాధన. దీనిలో ఉద్దేశపూర్వకంగా గాలి పీల్చడం, వదలడం వల్ల  శ్వాసను ఒక నిర్దిష్ట క్రమంలో పెట్టుకోగలుగుతాం. యోగా అభ్యాసకుల ప్రకారం.. ప్రాణాయామ అనేది శరీరం, మనస్సు రెండింటినీ అనుసంధానించే ప్రక్రియ. ఇది ఇతర శారీరక భంగిమలు, ధ్యానం వంటి ఇతర అభ్యాసాలతో చేస్తారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే జీవక్రియను కూడా పెంచుతుందంటున్నారు నిపుణులు.

వెయిట్ ట్రైనింగ్(Weight training)..
ఇది బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా  బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. చాలామంది పెద్దలు 35 ఏళ్ల తర్వాత నుంచి ప్రతి ఏడాది దాదాపు అర పౌండ్ల కండరాలను కోల్పోతారు. ఎందుకంటే చిన్నతనంలో ఉన్నంత చురుకుగా శరీరం ఉండదు. 

జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. పైగా కండరాలు కోల్పోవడం, బరువు పెగరడానికి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే వయసు కూడా ఇదే. కాబట్టి ఇది ఈ వెయిట్‌ ట్రైనింగ్‌ కేలరీలను బర్న్‌ చేయడానికి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నడక(Walking)..
క్రమం తప్పకుండా నడవడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి, కండరాలు పెరుగుతాయి. పైగా బొడ్డు కొవ్వు గణనీయంగా తగ్గుతుంది. కొండలు లేదా స్వల్ప వంపులు ఉన్న మార్గాల్లో నడవడానికి ప్రయత్నిస్తే మరింత ఫలితం ఉంటుందన్నారు నిపుణులు.

ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Diet)
ఇతర ఏ డైట్‌ల కంటే కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే మంచివి. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం మంచిది. జంతు ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలైన..పండ్లు, కూరగాయాలు తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు సిద్ధూ. 

అలాగే చక్కెర, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు. నిపుణులు కూడా ఆలివ్‌ నూన్‌, ఇతర మొక్కల నుంచి తీసిన నూనెలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని నొక్కి చెబుతున్నారు. 

(చదవండి: మహా కుంభమేళాలో పాల్గొన్న ఇండిగో సీఈవో..మాటల్లో చెప్పలేని శాంతి..!)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)