Breaking News

ఆరు నాట్య‌రీతుల అద్భుత స‌మాగ‌మం

Published on Sun, 12/01/2024 - 09:26

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదిక‌పై ఆరు ర‌కాల నృత్య‌రీతుల‌ను అత్యంత అద్భుతంగా ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసింది.. అమ్రిత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్టు వారి నాట్య‌తోర‌ణం కార్య‌క్ర‌మం. న‌గ‌రంలోని శిల్ప‌క‌ళావేదిక‌లో శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 8 గంటల వ‌ర‌కు సాగిన ఈ కార్య‌క్ర‌మానికి ప్రాంగ‌ణం సామ‌ర్థ్యాన్ని మించి ప్రేక్ష‌కులు రావ‌డంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, క‌థ‌క్, ఒడిస్సీ, ఆంధ్ర‌నాట్యం లాంటి నృత్య‌రీతుల‌కు చెందిన క‌ళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున త‌మ త‌మ నాట్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం మొత్తం క‌ళాకారిణులు అంద‌రూ క‌లిసి ఒకేసారి చేసిన జుగ‌ల్‌బందీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది.

ప్రముఖ నాట్య‌గురువులు క‌ళాకృష్ణ (ఆంధ్ర‌నాట్యం), అనితా గుహ (భ‌ర‌త‌నాట్యం), చావ‌లి బాల త్రిపుర‌సుంద‌రి (కూచిపూడి), నీనా ప్ర‌సాద్ (మోహినీ అట్టం), శామా భాటే (క‌థ‌క్‌), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్ర‌నాట్యం) త‌దిత‌రుల సార‌థ్యంలో ఈ క‌ళాకారులంతా త‌మ త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. అమ్రిత‌ క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్టును ప‌గ‌డాల రాజేష్‌, భార్గ‌వి దంప‌తులు ప్రారంభించారు. దీని యాజ‌మాన్య క‌మిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవ‌తి పుప్పాల‌, సురేంద్ర‌నాధ్ త‌దిత‌ర దిగ్గజాలు ఉన్నారు.

భార‌తీయ సంప్ర‌దాయానికి పెద్ద‌పీట వేస్తూ... అన్ని ప్రాంతాల‌కు చెందిన నృత్య క‌ళారీతుల‌ను ప్రోత్స‌హించేలా ఇంత పెద్ద కార్య‌క్ర‌మాన్ని ఇంత అద్భుతంగా నిర్వ‌హించినందుకు అమ్రిత‌ క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్టును అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నామ‌ని కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి శైల‌జా రామ‌య్య‌ర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్, ఆదాయ‌ప‌న్ను శాఖ మాజీ ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిష‌న‌ర్ పి.వి. రావు  అన్నారు. నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్న క‌ళాకారిణులంద‌రికీ ఈ రంగంలో అద్భుత‌మైన భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ఆకాంక్షించారు.

ఈ కార్యక్ర‌మంలో ప్ర‌త్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ న‌ర‌సింహారావు, ప‌ద్మ‌శ్రీ ప‌ద్మ‌జారెడ్డి, కోటి సూర్య ప్ర‌భ‌, శిల్పారెడ్డి, టీవీ9 ర‌జ‌నీకాంత్, ప‌ద్మ‌శ్రీ ఉమామ‌హేశ్వ‌రి, మాదాల ర‌వి, ఆశ్రిత వేముగంటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

(చదవండి: Mouni Roy:కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్‌ చేసిన నటి)

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)