Breaking News

మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..

Published on Fri, 04/11/2025 - 13:35

మాతృత్వం ఓ వరం అంటారు. అదిపొందలేక బాధపడుతున్న వాళ్లెందరో. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, జంక్‌ఫుడ్‌లతో మాతృత్వం మసకబారుతోంది. ముఖ్యంగా తల్లులు, కాబోయే తల్లులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టీనేజ్‌ వయసు నుంచే ఆడపిల్లలు మంచి ఆహారపు అలవాట్లు తీసుకునేలా కేర్‌ తీసుకుంటే..పెళ్లయ్యాక అలాంటి సమస్యలుబారిన పడరని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు తల్లలు ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది ఏప్రిల్‌11న 'మాతృత్వ సంరక్షణ దినోత్సవం' పేరుతో ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు మహాత్మాగాంధీ భార్య  కస్తుర్బా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ  సందర్భంగా అమ్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా..? కాబోయే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 

బారతదేశంలో మాతృత్వ సంరక్షణ పరంగా మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిని వర్గాల్లో మాత్రం ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసూతి మరణాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండటమే అత్యంత ఆందోళన కలింగించే అంశం. 

పట్టణాల్లో అమ్మల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రసూతి మరణాలు తగ్గించే విషయాల్లో బేషుగ్గానే ఉన్నా..పేదరికం, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సమస్య ఓ సవాలుగా ఉంది. ప్రధాన కారణాలు.. తీవ్రమైన రక్తస్రావం, ఇన్షెక్షన్లు, అధిక రక్తపోటు, అసురకక్షిత గర్భస్రావాలు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం తదితరాలని చెబుతున్నారు నిపుణులు. 

పట్టణ ప్రాంతాల్లోని మహిళలకి వీటిపై కొంత అవగాహన ఉంది, పైగా అందుబాటులో ఆస్పత్రులు, ఆరోగ్య నిపుణుల సలహాను సులభంగా పొందగలరు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంకా నాటు వైద్యాన్నే ఆశ్రయించడం, గర్భిణితో ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేమి తదితరాలు ప్రసూతి మరణాల ప్రమాదాన్నిపెంచుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చొరవతో..
ప్రసూతి మణాలు అడ్డుకట్టే వేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అంగన్‌వాడి, హోమ్‌ డాక్టర్‌ వంటి పథకాలతో అమ్మలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పురోగతి సాధిస్తోంది కూడా. పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్య అసమానతలను అధిగమించాలంటే..కేవలం అవగాహన కార్యక్రమాలతోనే సాధ్యం. 

అందుకోసమే ప్రభుత్వాలు తల్లిపిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం తదితరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. గర్భస్రావాలు జరగకుండా ఉండేలా.. ఆడపిల్లల ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం అందించేలా కొన్ని రకాల పథకాలను కూడా ఇస్తుండటం గమనార్హం. అయితే అవి ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతోనే భారత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు నిపుణులు. 

అందువల్లే ఏటా ఈ దినోత్సవం రోజునైనా పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అందించే ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించడం, మాతృత్వ మధురిమను రక్షించేకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు. అంతేగాదు స్కూళ్లు, కాలేజ్‌లు, కార్యాలయాల్లో పెద్దఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత ముఖ్యం అని అంటున్నారు గైనకాలజిస్టులు. కాగా, ఇక ఈ ఏడాది "ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు" అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. 

తల్లుల ఆరోగ్యం కోసం..

  • పోషకాహారం తీసుకోవడం

  • గర్భనిరోధక మాత్రలు వైద్యులు పర్యవేక్షణలోనే వాడటం, అతిగా వాడకం నిరోధించటం తదితరాలు..

  • ప్రసవం ముందు, తదనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోవడం

  • సరైన ఫ్యామిలీ ప్లానింగ్‌

  • దీంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం తదితరాలతో అమ్మల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే  మన కుటుంబానికి ఆధారమైన ఆమె ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇద్దాం. 

 

(చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)