Breaking News

పెట్‌ బ్రీడ్‌.. బీ కేర్‌ఫుల్‌ డ్యూడ్‌..! మన వాతావరణానికి సరిపడేవే బెస్ట్‌..

Published on Fri, 04/11/2025 - 10:06

ఒకప్పుడు మంచి కాలక్షేపాన్ని అందించే నేస్తాలుగా, అలసిన జీవితాలకు ఆహ్లాదాన్నిచ్చే ఆప్తులుగా భావించిన నగరవాసులు.. ఇప్పుడు  పెట్స్‌ను స్టేటస్‌ సింబల్‌గా చూస్తున్నారు. లక్షలు, కోట్లు వెచ్చించి ఖరీదైన బ్రీడ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మన వాతావరణానికి నప్పని వాటిని ఎంచుకోవడం పొరపాటవుతుందని పెట్‌ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. 

గతంలో సింబా అనే ఒక సెయింట్‌ బెర్నార్డ్‌ను గతంలో బర్కత్‌పురాకు చెందిన జంతు కార్యకర్తలు రక్షించారు. దాన్ని ఒక కాంపౌండ్‌ లోపల బంధించి ఉంచారు. సరైన ఆహారం ఇవ్వకపోవడంతో, కంటి చూపు కోల్పోయి అనారోగ్యం భారిన పడిన సింబా ఆ తర్వాతు జంతు ప్రేమికుల సంరక్షణలో కోలుకుంది. అలా సింబా మాదిరిగానే, మరికొన్ని శునకాలనూ వాటిని తగిన విధంగా చూసుకోలేని యజమానులు వాటి ఖర్మానికి వదిలేస్తున్నారు. 

కొంపల్లి హైవే పైన గ్రేట్‌ డేన్‌ ను రక్షించిన శునకాల బిహేవియర్‌ థెరపిస్ట్‌ పన్నీరు తేజ మాట్లాడుతూ, ఈ విదేశీ జాతి శునకాలను చాలా వరకూ అక్రమ పెంపకందారుల నుంచి కొనుగోలు చేస్తారని, అయితే అనారోగ్య పరిస్థితి ఏర్పడిన తర్వాత వదిలివేస్తారని తెలిపారు. ‘చాలా మంది పెంపుడు జంతువుల యజమానులు జాతి ఆహార నిర్వహణ అవసరాల గురించి అవగాహన లేకుండానే థోరోబ్రెడ్‌ శునకాలను కొనుగోలు చేస్తారు’ అని ఆయన చెప్పారు.  

అవగాహన, సంరక్షణ అవసరం..  
జర్మన్‌ షెపర్డ్‌ వంటి భారీ బ్రీడ్స్‌ అపార్ట్‌మెంట్‌లకే పరిమితం కాకూడదని, మన వాతావరణ పరిస్థితులకు అవి తగినవి కాదని నిపుణులు అంటున్నారు. ఇటువంటి శునకాలు అనేక అనారోగ్యాలకు గురవుతాయి, ‘కుక్కపిల్లని ఇంటికి తీసుకురావడం అంటే అది జీవితకాల బాధ్యత. బిడ్డకు ఎంత శ్రద్ధ, సంరక్షణ, సమయం అవసరమో వాటికీ అంతే అవసరం. 

ఇటీవల, నగరవాసులు కొందరు చౌ చౌస్, సెయింట్‌ బెర్నార్డ్స్, సైబీరియన్‌ హస్కీలు, అలాస్కాన్‌ మాలమ్యూట్స్‌ వంటి బ్రీడ్స్‌ను పెట్స్‌గా ఎంచుకుంటున్నారు. అయితే ఇవి మన వాతావరణానికి సరిపోవు. ఇవి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో మాత్రమే తగిన విధంగా పెరుగుతాయి.  భారతీయ వాతావరణానికి ఎప్పటికీ సర్దుబాటు కావు’. అంటూ పెట్‌ నిపుణుడు మురళి చెబుతున్నారు. 

సరిపడకపోతే.. అనారోగ్యాల వెతే.. 
నప్పని నగర వాతావరణం వల్ల కొన్ని బ్రీడ్స్‌ అనేక అనారోగ్యాలకు గురవుతాయి. గ్యాస్ట్రోఎంటిరైటిస్, హీట్‌ స్ట్రోక్, వైరల్‌ బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లకు సులభంగా గురవుతాయి. కాబట్టి ఇండియన్‌ బ్రీడ్స్‌ లేదా దశాబ్దాల తరబడి భారతదేశంలో భాగమైన జాతులను దత్తత తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక్కడి వాటికి ఇన్ఫెక్షన్ల నిరోధకత కలిగి ఉంటాయి. కఠినమైన వాతావరణాన్ని తట్టుకోగలవు అని చెబుతున్నారు.   

(చదవండి: పీరియడ్స్‌ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!)
 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)