Breaking News

జాతీయ పోషకాహార వారోత్సవం 2024 : అందంగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో జీవించాలంటే!

Published on Mon, 09/02/2024 - 15:59

మనిషి ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే సరైన పోషకాలు అవసరం.  కుల, మత, లింగ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి  శిశువుల నుంచి వృద్ధుల దాకా పోషకాహారం చాలా కీలకం. పోష కాహారంపై శ్రద్ధ పెట్టకపోతే జీవితం అతలాకుతలమవుతుంది. అనేక వ్యాధులకు మూలంగా మారి పోతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి, శరీరానికి పోషకాహారం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పాటిస్తారు. సెప్టెంబరు 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని నిర్వహిస్తారు.

1982లో  కేంద్రం (ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్) ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ వార్షిక కార్యక్రమం భాగంగా పోషకాహార లోపాన్ని గుర్తించడం, పరిష్కరించడం. అలాగే  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో , వ్యాధులను నివారించడంలో సమతుల్య  ఆహారం కీలక పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.

ముఖ్యమైన పోషకాలు 
విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ శరీరానికి  కావల్సిన పోషకాలు. ముఖ్యంగా పిలల్లో ఈ పోషకాల ప్రాముఖ్యత పాత్ర చాలా ఉంది. వారి మానసిక,శారీరక ఎదుగుదలకు వికాసానికి, ఎముకల బలానికి చాలా అవసరం., పోషకాహారం లోపంతో శారీరక బలహీనత ఏర్పడి,  అనేక రోగాలు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వైరస్‌ల దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది.

పోషకాహారం అంటే?
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్‌ల మిశ్రమాలతో సంపూర్ణ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో సహజంగా లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, మొలకెత్తిన గింజలు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకుండా ప్రొటీన్‌ ఫుడ్‌పై శ్రద్ధపెట్టాలి.  ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చక్కెర, ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. కూల్‌ డ్రింక్‌లు, అనారోగ్య కరమైన కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్‌ చేసిన, ఫాస్ట్‌ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలను పరిమితం చేసుకోవాలి.  హెర్బల్ టీలను ఎంచుకోవడం  బెటర్‌.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)