Breaking News

మీరు నమ్మాలేగానీ...అవే నిజమైన ఆస్తి

Published on Tue, 08/12/2025 - 10:44

ఒకప్పుడు పుస్తకం కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోతే లైబ్రరీల బాట పట్టేవారు. చదువుకోడానికి సరైన వసతి లేకపోయినా, పఠనాసక్తి కలిగిన వారు గ్రంథాలయాలనే ఆశ్రయించేవారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం విద్యార్థులను లైబ్రరీల నుంచి దూరం చేసింది. ఏ విషయం కావాలన్నా గూగుల్‌లో వెతకడం సులభమైపోయింది. కానీ గ్రంథాలయాలలోనే మనసుకు ప్రశాంతత, చదువుకు ఏకాగ్రత లభిస్తాయి. అందుకే నేటి తరాన్ని గ్రంథాలయానికి మళ్లించాల్సిన అవసరం ఉంది.

చరిత్రలో మొదటి గ్రంథాలయంగా అసుర్బానిపాల్‌ లైబ్రరీ (క్రీ.పూ. 7వ శతాబ్దం, నినెవె, ఇరాక్‌) ప్రసిద్ధి చెందింది. ఇందులో మట్టి పలకలపై క్యూనీఫార్మ్‌ లిపిలో రాసిన సుమారు 30,000 హస్త ప్రతులు ఉన్నాయి. భారత దేశంలో అతిపెద్ద లైబ్రరీ కలకత్తా పబ్లిక్‌ లైబ్రరీ. 1836 మార్చి 21న ద్వారకానాథ్‌ టాగూర్‌ ప్రారంభించిన ఈ లైబ్రరీ, స్వాతంత్య్రం తర్వాత నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాగా మారి ఇప్పుడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధీనంలో నడుస్తోంది. ఇక్కడ 25 లక్షల పుస్తకాలు ఉండగా, బెంగాల్‌ శాస్త్రవేత్త ఆశుతోష్‌ ముఖర్జీ ఒక్కడే 80,000 పుస్తకాలు దానం చేశారు. మరో విశిష్ట గ్రంథాలయం ఏషియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ ముంబయి. 1833లో జేమ్స్‌ మాకింతోష్‌ దీన్ని ప్రారంభించారు.

ఇదీ చదవండి: బాల అమితాబ్‌ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
 

192 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లైబ్రరీలో లక్షకు పైగా పుస్తకాలు ఉండగా, 15,000 అరుదైన గ్రంథాలు మాణిక్యాల్లా మెరుస్తున్నాయి. ఆధునికతకు అనుగుణంగా, ఇక్కడి అన్ని పుస్తకాలు, లిఖిత ప్రతులు, పత్రికలను డిజిటల్‌ రూపంలోకి మార్చి ‘గ్రంథ్‌ సంజీవనీ వెబ్‌సైట్‌’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచారు.

నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ‘సోషల్‌ మీడియా కోసం కాదు, సొంత మెరుగుదలకు చదువుదాం!’ అనే ప్రతిజ్ఞ తీసుకుందాం.
– అర్జునరావు రాజనాల, అరోరా పీజీ కళాశాల గ్రంథాలయ విభాగాధి పతి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)