Breaking News

అలీగఢ్‌లో జెన్‌జీ జెండా

Published on Wed, 11/11/2026 - 04:18

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలోస్టూడెంట్స్‌ ఎలక్షన్స్‌ ఎప్పుడూ  అబ్బాయిల వ్యవహారమే. గత 40 ఏళ్లుగా స్టూడెంట్స్‌ ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టుల్లో  ఒక్క అమ్మాయి గెలిచిన పాపాన పోలేదు. దీనిని మారుద్దాం అనుకుంది నస్రా నైమ్‌.  పోరాడింది. వైస్‌ప్రెసిడెంట్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. జెన్‌జెడ్‌ పల్స్‌ తెలిపే స్టోరీ ఇది.

‘నేను గెలవడానికే నిలబడ్డాను’ అంది నస్రా నైమ్‌ స్టూడెంట్స్‌ హర్షధ్వానాల మధ్య. ‘నేను నా జెండర్‌  కార్డు ఉపయోగించి ఓట్లు అడగలేదు. ఈ క్యాంపస్‌లో విద్యార్థుల హక్కుల కోసం గత ఐదేళ్లుగా గ్రౌండ్‌ లెవెల్‌లో పోరాడుతున్న యాక్టివిస్ట్‌గా బరిలోకి దిగాను. విద్యార్థులు నేను స్త్రీ కావడం వల్ల కాదు, నా పనిని చూసి ఓటేశారు’ అందామె.
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో నవంబర్‌ 5న జరిగిన స్టూడెంట్స్‌ ఎలక్షన్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డ నస్రా తన ప్రత్యర్థిపై 1,273 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం పొందింది. గతంలో యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఇలా ఈ పొజిషన్‌లో ఎప్పుడూ గెలవలేదు.

అబ్బాయిల ప్రపంచం
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (AMU) క్యాంపస్‌ ప్రత్యేకమైన ప్రపంచం. అక్కడ స్టూడెంట్స్‌ ఎలక్షన్స్ వచ్చాయంటే నినాదాలు, వ్యూహాలు, గంభీర వాతావరణం... అబ్బాయిలదే. అందుకే 40 ఏళ్లుగా అక్కడ స్టూడెంట్స్‌ ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్, సెక్రటరీ లాంటి అత్యున్నత పోస్టుల్లో ఒక్క అమ్మాయీ గెలిచిన దాఖలా లేదు. ‘ఎప్పటికీ ఇలాగే సాగాలా? చరిత్రను మనం మార్చలేమా?’ అనుకుంది 22 ఏళ్ల లా స్టూడెంట్‌ నస్రా. మగవాళ్ల మధ్యన, ఆ పాత గోడల మధ్య ఒంటరిగా నిలుచుని పోరాడింది.

భయాలను దాటి.. బరిలోకి దూకి!
‘క్యాంపస్‌లో స్టూడెంట్‌ పాలిటిక్స్‌ చాలా ముఖ్యం. మనం రాజకీయంగా చైతన్యవంతంగా లేకపోతే అడ్మినిస్ట్రేషన్‌ మనపై రుద్దే నిర్ణయాల వెనుక ఉన్న అసలు అర్థాలను మనం ప్రశ్నించలేము’ అంటుంది నస్రా. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ నుంచి అలీగఢ్‌ క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పుడు నస్రా నైమ్‌ చేతిలో ఉన్నది కేవలం ‘లా’ పుస్తకాలు కాదు... సమాజంలో మార్పు తేవాలనే బలమైన ఆశయం కూడా. 

నిజానికి ఆమె మొదట ప్రెసిడెంట్‌ పదవికే పోటీ చేయాలనుకుంది. కానీ అదే యూనివర్సిటీలో చదువుకున్న ఆమె తండ్రి షబ్బీర్‌ ఆలం కంగారుపడ్డారు. దశాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య క్యాంపస్‌లో ఒక అమ్మాయిని అంత త్వరగా అగ్రస్థానంలో అంగీకరించరని, అది ఒంటరి పోరాటమని వారించారు. కానీ నస్రా వెనక్కి తగ్గలేదు. తండ్రికి ధైర్యం చెప్పింది. పక్కా వ్యూహంతో, పరిమిత వనరులతోనే వైస్‌ 
ప్రెసిడెంట్‌ స్థానానికి నామినేషన్‌ వేసి సివంగిలా నిలబడింది.

142 ఏళ్ల నిశ్శబ్దానికి చరమగీతం!
క్యాంపస్‌లో హింస, శాంతిభద్రతల నెపంతో 2019 నుంచి యూనియన్‌ ఎన్నికలను అడ్మినిస్ట్రేషన్‌ నిలిపివేసింది. అయితే స్టూడెంట్స్‌ రైట్స్‌ కోసం సాగిన ఉధృతమైన నిరాహార దీక్షల్లో నస్రా ముందుండి నడిచింది. ఎన్నికలు వచ్చేలా చేసింది. తీరా ఎన్నికల బరిలో నిలిచాక డబ్బు లేదు, భారీ ప్రచార బృందాలు లేవు. కొద్దిమంది నమ్మకమైన స్నేహితులు తప్ప. వారితో కలిసి పోరాడింది. 

142 ఏళ్ల ఏఎమ్‌యూ చరిత్రలోనే అత్యున్నత కార్యవర్గ స్థానానికి ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నస్రా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. గత 40 ఏళ్లుగా విడిగా ఏర్పరిచిన మహిళా వింగ్‌ ఎలక్షన్స్‌లోని పోస్టులతోనే స్త్రీలు సర్దుకున్నారు. నస్రా జనరల్‌ ఎలక్షన్స్‌లో పోటీ చేసింది. నస్రా విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు. అది క్యాంపస్‌లో జెన్‌ జెడ్‌ అమ్మాయిల నిశ్శబ్ద విప్లవానికి ప్రతీక. పాతబడిన అకడమిక్‌ సిలబస్‌ను మార్చడం, విద్యార్థులు స్వేచ్ఛగా చర్చించుకునేలా క్యాంపస్‌ క్యాంటీన్‌ వంటి ‘థర్డ్‌ స్పేస్‌’లను పునరుద్ధరించడమే తన లక్ష్యాలని అంటోంది నస్రా.

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)