Breaking News

అపుడు రాజును బతికించిన ఐకానిక్‌ తుపాకీలు : ఇపుడు వేలంలో కోట్లు

Published on Tue, 07/09/2024 - 12:42

ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు. 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకున్నాడు. దీంతో  అధికారాన్ని కోల్పోయిన నెపోలియన్‌  చాలా తీవ్ర నిరాశ, ఒత్తిడికి  గురయ్యాడు. ఈ కారణంతోనే  ఏడాది 1814 ఏప్రిల్ 12 రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తొలుత తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలను కున్నాడు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించడంతో బతికిపోయాడు. ఆ తరువాత కూడా విషం తీసుకున్నాడు కానీ  ఈ సారీ  ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా ఇపుడు ఎందుకూ అంటే ఆ నాడు చక్రవర్తి తనను తాను చంపుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 15.26 కోట్లు) అమ్ముడు పోవడం విశేషంగా నిలిచింది.  

ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూ ప్యాలెస్ పక్కన ఉన్న ఒసేనాట్ ఆక్షన్‌ హౌస్‌లో ఈ వేలాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.  ఈ పిస్టల్స్‌ని జాతీయ సంపదగా ఉంచాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వాటి ఎగుమతిని నిషేధించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని అధికారిక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది. 

అయితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ  ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌‌ను ప్రకటిస్తే, దీన్ని తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. మరోవైపు ఫ్రాన్స్‌ నిబంధనల ప్రకారం దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే  బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి  తెలిపారు.

ఈ పిస్టల్స్‌ స్పెషాల్టీ ఏంటి? 
ఈ రెండు  ఐకానిక్‌  తుపాకులను  చక్రవర్తి  నెపోలియన్‌ బొమ్మతో బంగారం, వెండితో తయారు చేశారు. ఈ పిస్టల్స్‌ను పారిస్ తుపాకీ తయారీదారు లూయిస్-మారిన్ గోసెట్ రూపొందించారు. 1814లో నెపోలియన్ అధికారాన్ని కోల్పోయాడు. 

వేలం హౌస్ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్  సమాచారం  ప్రకారం తీవ్ర నిరాశ, ఒత్తిడితో, ఈ తుపాకీలతోనే  కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.  ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వద్ద పనిచేసే ముఖ్య ఆర్మీ అధికారి అర్మాండ్ డి కౌలైన్‌కోర్ట్  తుపాకీలోని పౌడర్‌ను తొలగించారు. దీంతో తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారట.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)