ఆ చేదు అనుభవమే స్టార్టప్‌గా అంకురార్పణ..! ఇవాళ అమెరికాలో..

Published on Sun, 07/06/2025 - 10:01

ఆపదలో అండగా...‘ఎంత పెద్ద ప్రాజెక్ట్‌ అయినా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది’ అంటుంది కర్ణాటకలోని బెలగావికి చెందిన యువ ఇంజనీర్‌ నందిత యెనగి. శరద్‌ పాటిల్‌తో కలిసి సెల్ఫ్‌–డిఫెన్స్‌ బ్రాండ్‌ ‘వేల్‌ వేరబుల్‌’ను ప్రారంభించింది నందిత. ఈవ్‌–టీజింగ్‌ రూపంలో తనకో చేదు అనుభవం ఎదురైంది. ఆ సమయంలోనే వచ్చిన ఒక ఆలోచనే సెల్ఫ్‌–డిఫెన్స్‌ స్టార్టప్‌కు కారణం అయింది.

ఉమెన్‌ సేఫ్టీ వేరబుల్స్‌పై కంపెనీ దృష్టి పెట్టింది. ‘వేల్‌ వేరబుల్‌’ కంపెనీ ప్రసిద్ధ టీవీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ దృష్టిలో పడింది. కంపెనీ ప్రారంభించడానికి కారణం, లక్ష్యాల గురించి ఈ కార్యక్రమంలో వివరించింది నందిత. ఈ కంపెనీలో 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్‌ చేయడానికి అమన్‌ గుప్తా, వినీత్‌సింగ్‌లు ముందుకు వచ్చారు.

‘మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా కంపెనీ మొదలు పెట్టాం. ఆత్మరక్షణ పరికరాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అంటుంది నందిత. ఎలక్ట్రికల్‌ షాక్‌ వేరబుల్స్‌ ద్వారా సెల్ఫ్‌–డిఫెన్స్‌ టెక్నాలజీకి సంబంధించి కొత్త అడుగు వేసింది...వేల్‌ వేరబుల్‌.

దేశీయ మార్కెట్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌ దృష్టిని కూడా ఆకట్టుకుంది వేల్‌ వేరబుల్‌. నందితను యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ తమ కంపెనీ గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేయడానికి తమ దేశానికి ఆహ్వానించింది. యూఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో తమ కంపెనీ సెల్ఫ్‌–డిఫెన్స్‌ గ్యాడ్జెట్‌ల గురించి వివరించింది నందిత యెనగి.

(చదవండి: మెడనొప్పి 'పీకల' మీదకు...! ఎందువల్ల ఈ పరిస్థితి)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)