Breaking News

జెమ్‌ జెన్సీ

Published on Wed, 06/25/2025 - 00:28

కొన్ని విజయాలు వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు. ఎంతోమందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చే విజయాలు. ‘జీవితం అంటే నిత్య నరకం’ అనుకున్న నిరాశామయ, నిస్సహాయ స్థితిలోనూ ‘విద్య’ అనే ఆయుధాన్ని నమ్ముకుంది ఎన్‌.జెన్సీ. ఆ ఆయుధం తనకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. దేశంలో ఆంగ్లభాషా విభాగంలో డాక్టరేట్‌ అందుకున్న, అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా నియామకం అయిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా అరుదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది...

బాల్యం ఎవరికైనా వరం. స్వర్గం. ఒక దశ వరకు ఆ అబ్బాయి స్వర్గంలోనే ఉన్నాడు. క్రమంగా ఆ అబ్బాయి మాటతీరు, నడక తీరులో మార్పులు కనిపించాయి. అవి కొని తెచ్చుకున్న మార్పులు కాదు. అయినప్పటికీ ఆ బాలుడి తల్లిదండ్రులకు బొత్తిగా నచ్చలేదు. ‘అలా మాట్లాడుతున్నవేమిటి?’ ‘అలా నడుస్తున్నావేమిటి!’... ఇలా రకరకాలుగా తిట్టేవాళ్లు. ఇక స్కూల్లో నిత్యనరకం.

తోటి పిల్లల నుంచి ఉ పాధ్యాయుల వరకు ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్‌ చేసి ఏడిపిస్తూనే ఉండేవారు. ఒకానొక సమయంలో బడికి వెళ్లాంటే భయపడే పరిస్థితి వచ్చింది. ‘బడికి వెళ్లేది  పాఠాలు వినడానికా! అవమానాల పాలు కావడానికా!’ అని మనసు ప్రశ్నించింది. అంతా చీకట్లోనూ ఒక ఆశాకిరణం కనిపించింది. ఆ వెలుగు పేరు... చదువు. ఆ వెలుగు దారిలో ఆ బాలుడి నడక ప్రారంభమైంది. అప్పటి ఆ బాలుడే... నేటి జెన్సీ.

తమిళనాడులోని తిరుత్తణికి చెందిన జెన్సీ చెన్నైలోని అంబేద్కర్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ఎం.ఏ., ఎం.ఫిల్‌.లో గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఆ బంగారు పతకాలు తన ఆత్మవిశ్వాసాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. ఇంకా ఏదో సాధించాలి అనే తపనను పెంచాయి. చెన్నై లయోలా కాలేజీలో ఆంగ్ల భాషా విభాగంలో డాక్టరేట్‌ అందుకొని, అదే కాలేజిలో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా నియామకం అయ్యింది. ‘ఇది నా విజయం కాదు. మా ట్రాన్స్‌ కమ్యూనిటీ విజయం. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాను. ఎన్నో కష్టాలూ అనుభవించాను. అయితే... చదువు మనుషుల వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుతుంది. ధైర్యాన్ని ఇచ్చి విజయాలు సాధించేలా చేస్తుంది’ అంటుంది జెన్సీ.

ఎందుకు ఆమోదించడం లేదు?
ట్రాన్స్‌జెండర్‌లను చిన్నచూపు చూడకూడదు. అవమానాలు తట్టుకోలేక ఇంటినుంచి  పారి పోయేలా చేయకూడదు. వారిని చదువుకు దగ్గర చేస్తే తమను తాము నిరూపించుకోగలరు. అందుకు నేనే సాక్ష్యం. యూజీ, ఎం.ఏ.లో నేను గోల్డ్‌మెడలిస్ట్‌. మొదట్లో ఎలా ఉన్నా నేను ఈ స్థితికి రావడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. ప్రకృతిని అందరూ ఆమోదిస్తున్నప్పుడు ఆ ప్రకృతిలో భాగమైన మమ్మల్ని మాత్రం ఎందుకు ఆమోదించడం లేదు? – జెన్సీ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)