Breaking News

వర్షాకాలంలో కిచెన్‌ క్లీన్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Published on Mon, 06/24/2024 - 12:44

వర్షాకాలం అనంగానే సీజనల్‌ వ్యాధులు పగబట్టినట్లుగా మనుషులపై దాడి చేస్తాయి. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియా, వైరస్‌లే. వాతావరణంలోని తేమ కారణంగా సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు పాడవ్వడం లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కిచెన్‌ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత ఆరోగ్యం ఉంటాం. నిత్యం మన ఉపయోగించే కిచెన్‌లోని వస్తువులు పాడవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి సవివరంగా తెలుసుకుందామా..!

వర్షాకాలంలో కిచెన్‌ని సురక్షితంగా ఉంచేలా పాటించాల్సినవి ఇవే..

  • కిచెన్‌ చిమ్నీ, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌: వంటగదిలో సూర్యరశ్మి వచ్చేలా, తేమ చేరకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంటారు పెద్దలు. కానీ వర్షాకాలంలో అలా అస్సలు కుదరదు. ఎండ అనేది పెద్దగా ఉండదు, పైగా వాతావరణంలోని తేమ కారణంగా కిచెన్‌ను పొడిగా ఉంచడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడూ కిచెన్‌కి ఉండే ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లను శుభ్రపరిచి ఆన్‌ చేసి ఉంచాలి.  అలాగే వంటగది చిమ్నీ కూడా డెస్ట్‌ లేకుండా ఉంచుకుంటే తేమ చేరకుండా కాపాడుకోగలుగుతాం.  కిచెన్‌ కూడా పొడిగా ఉంటుంది.

  • అలాగే వంటగదిలో సరుకులు పాడవ్వకూడదంటే గాలి చొరబడిన క్లోజ్‌డ్‌ కంటైనర్‌లలో భద్రపరుచుకోండి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను తేమ, బ్యాక్టీరియా చేరకుండా ఉండేలా గాలి చొరబడిని గాజు పాత్రలో ఉంచాలి. 

  • ఇక వంటగదిలో పంచదార, కొన్ని రకాలు పొడులు అవి పాడ్వకుండా ఉండేందుకు వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులతో సమస్యను నివారించండి. దాల్చిన చెక్క, లవంగాలు వంటి వాటిని నిల్వ ఉంచే పొడులకు చేర్చితే పాడవ్వకుండా ఉంటాయి. 

  • సింక్ పైపులను శుభ్రంగా ఉంచండి: వంటగదిలోని సింక్‌పైపులు చక్కగా ఉండేలా చూడండి. ఎలాంటి లీక్‌లు లేవనేది నిర్థారించుకోండి. దీనివల్ల దోమలు, ఈగలు రాకుండా కాపాడుకోగలుగతాం. ఈ సీజన్‌ ప్రారంభమయ్యే ముందే ఈ జాగ్రత్తలను తప్పనసరి తీసుకోవాలి. 

  • అలాగే కాలానుగుణ పండ్లను, కూరగాయలను తీసుకోండి. వాటిని తాజాగా నిల్వ ఉంచుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అని చెబుతున్నారు నిపుణులు. 

(చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)