Breaking News

' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!

Published on Wed, 06/18/2025 - 11:20

మెల్లి మెల్లిగా వర్షాలు పడటంతో నగరంలో చల్లదనపు వాతావరణం ఆవరించుకుంటోంది. గాలి తేమతో నిండిపోయి, ప్రకృతి కళగా మారిన ఈ సమయంలో నగరవాసులు వారి ఇళ్లకు, అపార్ట్‌మెంట్లకు, మిద్దెలకు ఆకుపచ్చ అందాన్ని అద్దేందుకు సంసిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు ఇది అత్యుత్తమ కాలం కావడం, అదే సమయంలో గ్రీన్‌ లివింగ్‌ పై నగరవాసుల్లో పెరిగిన ఆసక్తి వర్షాకాలాన్ని సరైన సమయంగా మార్చుతోంది. ఇంట్లో చిన్నదైనా సరే.. ఒక గ్రీన్‌ కార్నర్‌ ఉంటే, అది మన మూడ్‌కు, ఆరోగ్యానికి, జీవనశైలికి నూతన శోభను తీసుకురాగలదు. మొక్కలతో బంధాన్ని పెంచుకుంటే ఈ బీజీ లైఫ్‌లో కాసింతైనా ఉపశమనం లభిస్తుందని నగరవాసుల అభిలాష. ఈ నేపథ్యంలో మొక్కల ప్రేమికులు నర్సరీల బాట పడుతుంటే, మరికొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ పెడుతున్నారు. 

గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం గార్డెనింగ్, టెర్రస్‌ గార్డెనింగ్, ఇంటీరియర్‌ ప్లాంటేషన్‌ వంటి అభిరుచి గణనీయంగా పెరిగాయి. పని ఒత్తిడిని తేలికపరచడానికి,ఇంట్లోకి ప్రకృతి పారవశ్యాన్ని తీసుకురావడానికి మొక్కలు సరైన ఎంపికగా మారాయి. ఇది ఒక హాబీ అనడం కన్నా.. ఓ నూతన జీవన శైలిలో భాగంగా మారిందనడం సరైనదేమో. ప్లాంట్‌ థెరపీ అనే ట్రెండ్‌ ఇప్పుడు మెట్రో లైఫ్‌ స్టైల్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 

నర్సరీల్లో సందడి.. 
ఈ వర్షాకాలంలో హకీంపేట్, బేగంపేట్, ఖాజాగూడ, కొంపల్లి, బాచుపల్లి, అమీర్‌పేట్, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో నర్సరీలు రద్దీగా మారాయి. అంతేకాదు, పాతబస్తీ నుంచీ కొత్తబస్తీ వరకూ పూల మొక్కలతో పాటు డెకరేటివ్‌ ప్లాంట్స్, హెర్బల్‌ ప్లాంట్స్, కూల్‌ ఎయిర్‌ ప్లాంట్స్‌ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ సీజన్‌లో డిమాండ్‌ పెరగడంతో నర్సరీ యజమానులు ఎక్కువగా మొక్కలను దిగుమతి చేస్తున్నారు. 

ముఖ్యంగా కడియం (ఆంధ్రప్రదేశ్‌), బెంగళూరు, పుణె వంటి గార్డెనింగ్‌ మార్కెట్ల నుంచి నగరానికి మొక్కలు ఎక్కువగా వస్తుండటమే కాకుండా కొన్నింటి ధరలు గణనీయంగా పెరిగాయి. అయినా సరే, మొక్కలపై ఉన్న ప్రేమ ముందు ధరలు విషయమే కాదనుకుంటున్నారు ప్లాంట్‌ లవర్స్‌. హైదరాబాద్‌ మహా నగరంలో ఏడాదంతా అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ.. ఈ సీజన్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే మొక్కలే తమకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయని కూకట్‌పల్లికి చెందిన నర్సరీ నిర్వాహకులు వేణుమాధవ్‌ తెలిపారు.  

బిజీ లైఫ్‌.. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌.. 
బిజీ లైఫ్‌లో మొక్కలు కొనడానికి సమయం లేనివారు ఇప్పుడు మొక్కలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు. ఉగావో, నర్సరీలీవ్, మైబాగీచ, అమెజాన్, బిగ్‌బాస్కేట్, గార్డెనింగ్‌ స్టోర్, అర్బన్‌ మాలి వంటి ప్లాట్‌ఫాంల ద్వారా నేరుగా ఇంటి వద్దకే మొక్కలు డెలివరీ అవుతున్నాయి. కొంత మేరకు ఖర్చు ఎక్కువైనా, బ్రాండెడ్‌ ప్లాంట్‌ ప్యాకేజింగ్, ఎలా నాటాలి–పెంచాలనే సూచనలు, పెంపకం టిప్స్‌ ఇవ్వడం వల్ల కొనుగోలు ధోరణి పెరుగుతోంది. 

జీవనశైలిగా మారిన పచ్చదనం.. 
కేవలం అందం కోసమే కాక, కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా, ఇంట్లో మంచి హ్యుమిడిటీకి, ఆక్సిజన్‌ సరఫరాకు మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గ్రీన్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్, బాల్కనీ గార్డెనింగ్, వాల్స్‌పై వరి్టకల్‌ గార్డెన్, వాటర్‌ సేవింగ్‌ ప్లాంటేషన్‌ వంటి కాన్సెప్ట్‌లు పెరుగుతున్నాయి. 

ట్రెండింగ్‌ ప్లాంట్స్‌.. 
ఇండోర్‌ డెకోరేటివ్‌ ప్లాంట్స్‌– మోన్సె్టరా, పీలియా, స్నేక్‌ ప్లాంట్, జెడ్‌ ప్లాంట్‌–పూల మొక్కలు–బోగన్‌విల్లా, రోసెస్, లిల్లీస్, హైబిస్కస్, హెల్కోనియా –ఔషధ మొక్కలు–తులసి, అశ్వగంధ, మఠి, అలోవెరా–ఫ్రూట్‌ ప్లాంట్స్‌–జామ, నేరేడు, మామిడి, లిచి, సీతాఫలం వంటి మొక్కలు ప్రస్తుతం ట్రెండింగ్‌ ప్లాంట్స్‌గా ఉన్నాయి. 

ఇంటింటా.. మిద్దె పంట.. 
నగరంలో ప్రధానంగా ప్లాట్స్, ఇండిపెండెంట్‌ హౌసెస్‌ ఉన్న వారు మిద్దె పంటలకు పెద్దపీట వేస్తున్నారు. ఇంటికి సరిపడా కూరగాయలు, పూలను పెంచుకోవడంతో పాటు పచ్చదనాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా టమాట, బీర, దోస, కీరా, మునగ, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకుంటూ ఆరోగ్యాన్ని చక్కబెడుతున్నారు. 

(చదవండి: శరీరానికి సరిపడ బెస్ట్‌ ఫుడ్స్‌ ఏంటో తెలుసుకుందాం ఇలా..!)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)