Breaking News

ఈ ఘనత సాధించిన తొలి మహిళా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రికార్డ్‌

Published on Fri, 08/11/2023 - 09:57

పంజాబ్‌కు చెందిన జస్లీన్‌ రాయల్‌.. సింగర్, సాంగ్‌ రైటర్, కంపోజర్‌గా తనదైన ప్రతిభ చాటుకుంటోంది. పంజాబీ, హిందీ, బెంగాలీ, గుజరాతీలతో పాటు ఇంగ్లీష్‌లోనూ పాటలు పాడింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది. లుథియానాలో హైస్కూల్‌ చదువు పూర్తయిన తరువాత పై చదువుల కోసం దిల్లీ వచ్చింది జస్లీన్‌. హిందూ కాలేజ్‌లో బి.కామ్‌ పూర్తి చేసింది. సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్‌.

తాను సెల్ఫ్‌–టాట్‌ ఆర్టిస్ట్‌. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడం తన ప్రత్యేకత. పిల్లలకు సంగీత పాఠాలు చెప్పడం వల్ల పాకెట్‌ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ ఫస్ట్‌ సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షించింది జస్లీన్‌. తన సంగీత ప్రతిభతో ‘వన్‌ ఉమెన్‌ బ్యాండ్‌’గా పేరు తెచ్చుకుంది.

‘బాలీవుడ్‌లోకి రావాలనేది నా చిన్నప్పటి కల. అయితే అది అంత సులభంగా నెరవేరలేదు. ఇక వెనక్కి వెళ్లిపోదాం అనుకునే సందర్భాలు అందరిలాగే నాకూ ఎదురయ్యాయి. పరీక్ష సమయంలో గట్టిగా నిలబడితే విజయం మన సొంతం అవుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది’ అంటున్న జస్లీన్‌ రాయల్‌ రకరకాల  ప్రాజెక్ట్‌లతో ముంబైలో బిజీబిజీగా ఉంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)