కేరళలో పెరుగుతున్న గవదబిళ్లల కేసులు! ఎందువల్ల వస్తుందంటే..

Published on Thu, 03/14/2024 - 18:03

కేరళలో గవద బిళ్లల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 190 కేసులు నమోదయ్యాయి. దీంతో నేషనల్‌సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ను కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. గత నెలలో దాదాపు 2,500 కేసులు దాక నమోదయ్యినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాల రాష్ట్రాల పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గవద బిళ్లలు ఎందుకొస్తాయి? నివారణ ఏంటీ? తెలుసుకుందామా!.

ఈ గవద బిళ్లలు ముఖ్యంగా పిల్లలు, యువకులను ప్రభావితం చేసే వైరల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది రుబులవైరస్ కుటుంబానికి చెందిన పారామిక్సోవైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్‌కి మానవులు మాత్రమే అతిధేయులు. ఇది బాధితుడి నోటి నుంచి వచ్చే నీటి తుంపరల ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడు నోటి తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా చెవులు చుట్టూ ఉన్న రెండు ప్రాంతాల్లో బాధకరమైన వాపుతో కూడిన జ్వరం వస్తుంది.

లక్షణాలు..

  • గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి.
  • ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపుకు గురవుతాయి
  • దీనివల్ల ఏమీ తినలేరు తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది 
  • దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. 
  • ఇలా ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. 

సాధారణంగా ఈ గవదబిళ్లలు తేలికపాటివి, దానంతట అవే వెళ్లిపోతాయి. ఒక్కోసారి యువకులలో ఎన్సెఫాలిటిస్, చెవుడు లేదా ఆర్కిటిస్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

నివారణ..

  • డీ హైడ్రేట్‌ అవ్వకుండా ద్రవాల రూపంలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఆహారం మెత్తగా తీసుకోవాలి. 
  • తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం.
  • వాపును తగ్గించడానికి స్క్రోటల్ సపోర్ట్, ఐస్ ప్యాక్‌లను ఉపయోగించాలి
  • అలాగే వృషణాల వాపుతో కూడిన సందర్భాల్లో వాపును తగ్గించడానికి పరోటిడ్ గ్రంధులపై కోల్డ్ కంప్రెస్‌లను ఉపయోగించడం వంటివి చేయాలి.
  • నొప్పి, వాపును తగ్గేందుకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి.
  • బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • అత్యవసరమైతేనే స్టెరాయిడ్స్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

గవదబిళ్ళకు చికిత్స..
ప్రస్తుతం, గవదబిళ్ళకు నిర్దిష్ట చికిత్స లేదు. చాలా చికిత్సా ఎంపికలు ద్రవాలు ఎక్కువగా తాగడం, కోల్డ్ కంప్రెస్ చేయడం, సులభంగా జీర్ణమయ్యే మెత్తని ఆహారాలు తీసుకోవడం. ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక దీని బారిన గర్భిణీ స్త్రీలు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.

(చదవండి: ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు..ఆ ఇద్దరు మహిళలు!)

#

Tags : 1

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)